News July 18, 2024

వినియోగదారులు జాగ్రత్తలు పాటించాలి: ఎస్.ఈ

image

జిల్లాలో వర్షం పడుతున్న నేపథ్యంలో ప్రజలు విద్యుత్ వాడే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్.ఈ కెవిజి. సత్యనారాయణ అన్నారు. గురువారం ఒంగోలులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. విద్యుత్ సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. వచ్చే 4 రోజుల సిబ్బందికి సెలవులు లేవని స్పష్టం చేశారు. విద్యుత్ అంతరాయం ఉన్నట్లయితే 1912కి లేదా స్థానిక సిబ్బందికి తెలపాలని కోరారు. తడిచేతులతో విద్యుత్ పరికరాలు తాకవద్దని అన్నారు.

Similar News

News October 1, 2024

కావలిలో రోడ్డు ప్రమాదం.. ప్రకాశం విద్యార్థిని మృతి

image

ప్రకాశం(D) పొన్నలూరు (M) చెరుకూరుకు చెందిన కృపాకర్, మైథిలి అనే ఇద్దరు సోమవారం ఒంగోలు నుంచి నెల్లూరుకు స్కూటీపై వెళ్తుండగా కావలి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. స్థానికులు వెంటనే స్పందించి నెల్లూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో మైథిలి మృతి చెందింది. కృపాకర్‌కి తీవ్రగాయాలయ్యాయి. మృతురాలు పదో తరగతి చదువుతోంది. కావలి రూరల్ SI బాజీ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News October 1, 2024

ప్రకాశం జిల్లాలో పింఛన్ల పంపిణీకి రూ.122.64 కోట్లు మంజూరు

image

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అక్టోబర్ నెలకు సంబంధించి ప్రకాశం జిల్లాలోని 2,88,144 మంది లబ్ధిదారులకు రూ.122.64 కోట్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ అన్సారియా తెలిపారు. 2వ తేదీ గాంధీజయంతి కావడంతో 1న పింఛన్లు పంపిణీ చేయాలని సిబ్బందికి సూచించారు .ఈ మేరకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. అధికారులు బ్యాంకుల నుంచి నగదు విత్ డ్రా చేసుకోవాలన్నారు.

News September 30, 2024

ఒంగోలు: హిజ్రాలు ఆత్మగౌరవంతో బతకాలి: ఎస్పీ

image

హిజ్రాలు ఆత్మగౌరవంతో బతకాలని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. ఒంగోలులో సోమవారం హిజ్రాలు ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిజ్రాలు ఎదుర్కొంటున్న సామాజిక వివక్ష, అణచివేతలు నుంచి గర్వంగా సభ్య సమాజంలో తలెత్తుకొని బ్రతకాలని ఎస్పీ అన్నారు. హిజ్రాలు గ్రూపులుగా విడిపోయి శాంతి భద్రతల సమస్యలు సృష్టించడం, బలవంతపు వసూళ్లకు పాల్పడితే ఆత్మగౌరవం దెబ్బతింటుందన్నారు.