News December 24, 2024
వినియోగదారుల హక్కులపై అవగాహన ఉండాలి: బాపట్ల జేసీ
వినియోగదారుల హక్కులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ అన్నారు. మంగళవారం బాపట్ల కార్యాలయంలోని గ్రీవెన్స్ హాల్ ప్రాంగణంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. వినియోగదారులు తమ హక్కుల గురించి తెలుసుకోవాలన్నారు. వినియోగదారులు అమ్మకాలు, కొనుగోలులో ఇబ్బందులు కలిగితే వినియోగదారుల ఫారం ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Similar News
News December 25, 2024
తైక్వాండోలో సింగరాయకొండ విద్యార్థినికి గోల్డ్ మెడల్
ఢిల్లీలో జరిగిన నేషనల్ తైక్వాండో ఛాంపియన్ షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన ఇంటర్ విద్యార్థిని లీలామైత్రిని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి మంగళవారం సింగరాయకొండలో అభినందించారు. లీలామైత్రి సింగరాయకొండలోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదువుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేలా లీలామైత్రి చక్కని ప్రతిభ చూపడం గర్వనీయమని అభినందించారు
News December 24, 2024
ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం ఎస్పీ
జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచానికి శాంతిని ప్రబోధించిన ఏసుక్రీస్తు మార్గం ఆచరణీయమైనదనీ, ప్రజలందరూ శాంతి, సంతోషాలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.
News December 24, 2024
టీడీపీ, వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడి.. 33 మందిపై కేసులు
కొమరోలు మండలంలోని ముత్తరాసు పల్లె గ్రామంలో ఇరువర్గాల పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్న సంఘటనపై కేసులు నమోదు చేసినట్లుగా కొమరోలు ఎస్ఐ వెంకటేశ్వర్లు నాయక్ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం రాజకీయ కక్ష్యల నేపథ్యంలో ఇరువర్గాలు రాళ్లతో దాడులు చేసుకోగా ఇరువర్గాల ఫిర్యాదు మేరకు టీడీపీకి చెందిన 14 మందిపై, వైసీపీకి చెందిన 19 మందిపై కేసులు నమోదు చేసినట్లుగా వెల్లడించారు.