News March 23, 2025

వినుకొండ: ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య

image

వినుకొండ రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాల వద్ద ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్ఐ తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ.. మృతుడు తెలుపు నిండు చేతులు చొక్కా, ఆకుపచ్చ నైట్ ప్యాంటు ధరించినట్లు చెప్పారు. మృతుని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. వివరాలు తెలిసిన వారు స్థానిక రైల్వే పోలీసులను 9440438256 సంప్రదించాలన్నారు.

Similar News

News September 14, 2025

జూబ్లీహిల్స్‌లో ప్రజలతో మంత్రుల ముఖాముఖీ

image

జూబ్లీహిల్స్‌లోని సోమాజిగూడ డివిజన్‌లో జయ ప్రకాశ్ కాలనీ, ఇంజినీర్స్ కాలనీ ప్రజలతో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు ముఖాముఖీ నిర్వహించారు. రోడ్లు, డ్రైనేజీలు, పలు సమస్యలు స్థానికులు మంత్రికి తెలిపారు. వారు మాట్లాడుతూ.. అధికారులతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. సమస్యల వినతులపై పరిష్కారం చేస్తామన్నారు.

News September 14, 2025

లిబర్టీ వద్ద మాజీ సీఎం బూర్గులకు నివాళులు

image

బూర్గుల రామకృష్ణారావు వర్ధంతి సందర్భంగా లిబర్టీ క్రాస్ రోడ్‌లోని ఆయన విగ్రహానికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాలలువేసి నివాళులర్పించారు. బూర్గుల సీఎం చెరగని ముద్ర వేశారని, భవిష్యత్ తరాలకు ఆయన స్ఫూర్తిదాయక నేతగా నిలిచారన్నారు. ఆయన దూర దృష్టి ఇప్పటికి మనందరికీ ఆదర్శమని కీర్తించారు.

News September 14, 2025

యురేనియం వల్ల ఆరోగ్య సమస్యలొస్తాయా?

image

AP: తురకపాలెంలో ఇటీవల సంభవించిన మరణాలకు యురేనియమే కారణమని స్థానికులు భావిస్తున్నారు. తాజాగా నీటి శాంపిల్స్‌లో <<17705296>>యురేనియం అవశేషాలు<<>> బయటపడినట్లు వార్తలు రాగా, దీనిపైనే చర్చ జరుగుతోంది. కాగా నీరు, ఆహారం వల్ల యురేనియం శరీరంలోకి ప్రవేశిస్తే కిడ్నీల ఆరోగ్యానికి చేటు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. చర్మం, లివర్, లంగ్స్, ఎముకలపై ప్రభావం చూపి అనారోగ్యానికి కారణం అవుతుందని వెల్లడిస్తున్నారు.