News April 21, 2025
వినుకొండ: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. యువకుడి మృతి

వినుకొండ: పట్టణంలో క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. శనివారం క్రికెట్ ఆడుతుండగా గౌస్ బాషా (చంటి) అనే యువకుడు గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, కొద్దిసేపటికే మృతి చెందాడు. మూడేళ్ల క్రితమే వివాహమైన చంటి మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన స్థానికంగా కలచివేసింది. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు భౌతికకాయానికి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
Similar News
News April 21, 2025
ఆటగాళ్ల కాంట్రాక్టులు ప్రకటించిన BCCI

BCCI ప్లేయర్ల కాంట్రాక్టులు ప్రకటించింది. రోహిత్, కోహ్లీ, బుమ్రా, జడేజా A+లోనే ఉన్నారు. గ్రేడ్Aలో సిరాజ్, రాహుల్, గిల్, పాండ్య, షమీ, పంత్, గ్రేడ్Bలో సూర్య, కుల్దీప్, జైస్వాల్, అక్షర్, శ్రేయస్ స్థానం దక్కించుకున్నారు. రింకూ, తిలక్, రుతురాజ్, శివమ్, బిష్ణోయ్, సుందర్, శాంసన్, అర్ష్‌దీప్, ముకేశ్, ప్రసిద్ధ్, రజత్, జురెల్, సర్ఫరాజ్, ఇషాన్, నితీశ్, అభిషేక్, ఆకాశ్, వరుణ్, హర్షిత్ గ్రేడ్Cలో ఉన్నారు.
News April 21, 2025
ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభం

TG: జపాన్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్‌ను ఆయనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. దీంతో భారత్ నుంచి ఈ ఎక్స్‌పోలో పాల్గొన్న తొలి రాష్ట్రంగా TG నిలిచింది. రాష్ట్ర సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వం, పర్యాటక సంపదను ప్రతిబింబించే ప్రదర్శనలు ఇక్కడ ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంపై రేవంత్ బృందం దృష్టి సారించింది.
News April 21, 2025
వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

AP: YCP నేత వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. భూ అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ ఈ పిటిషన్ వేశారు. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. అటు లిక్కర్ స్కాం కేసులో రాజ్ కసిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని CIDని ఆదేశించిన HC, విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.