News November 27, 2024
వినుకొండ: టీడీపీ నేత కోడలి చీర మిస్సింగ్.. నోటీసులు జారీ

ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ కొడలు చీర కార్గో పార్శిల్‌లో మాయమైందని పలు ప్రచార మాధ్యమాల్లో వచ్చింది. ఈ నేపథ్యంలో వినుకొండ ఆర్టీసీ డీపో మేనేజర్‌ను వివరణ కోరగా, ఈ ఘటనపై డీఎం మాట్లాడుతూ.. ఒంగోలు నుంచి నెల్లూరుకు ఇచ్చిన పార్శిల్‌లో ఒక చీర మాయం అయినట్లు తెలిసిందన్నారు. ఈ సంఘటనపై హైయర్ బస్సు ఓనర్, డ్రైవర్‌కు నోటీసులు జారీ చేశామని చెప్పారు. త్వరలో వారు వచ్చి వివరణ ఇస్తారని తెలిపారు.
Similar News
News December 24, 2025
GNT: రైల్వే లైన్ భూ సేకరణకు నోటిఫికేషన్ విడుదల

నంబూరు – ఎర్రుపాలెం వరకు నిర్మిస్తున్న రైల్వే లైన్ కోసం మరో 300 ఎకరాలు భూ సేకరణ కోసం రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. NTR జిల్లాలోని 8 గ్రామాల్లో భూ సేకరణ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా భూ సేకరణ చట్టం ద్వారా భూములు తీసుకుంటే నష్టపోతామని ఇప్పటికే తాడికొండ రైతులు అభ్యంతరం తెలిపారు. భూ సమీకరణ ద్వారా భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. 2024 డిసెంబర్ 21న ప్రకటన ఇచ్చారు.
News December 24, 2025
GNT: బస్సు నడుపుతుండగా గుండెనొప్పి.. 68 మందిని కాపాడాడు

పెదనందిపాడు మండలం వరగాని వద్ద ఆర్టీసీ డ్రైవర్ సమయస్ఫూర్తి చూపారు. పర్చూరు నుంచి గుంటూరు వెళ్తుండగా డ్రైవర్‌కు ఒక్కసారిగా గుండెనొప్పి వచ్చింది. వెంటనే అప్రమత్తమై బస్సును పక్కకు ఆపి నిలిపివేశారు. దీంతో బస్సులోని 68 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులు వెంటనే డ్రైవర్‌ను స్థానిక ఆలీ క్లినిక్‌కు, అక్కడి నుంచి గుంటూరు ఆసుపత్రికి తరలించారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
News December 23, 2025
విజయవాడలో ఏఐ వాషింగ్ మెషీన్ల విడుదల

విజయవాడలోని సోనోవిజన్‌లో ఎల్‌జీ ఇండియా అత్యాధునిక ‘ఏఐ డీడీ 2.0’ టెక్నాలజీతో 10 కొత్త వాషింగ్ మెషీన్ మోడళ్లను విడుదల చేసింది. సోనోవిజన్ ఎండీ పి.భాస్కర మూర్తి, ఎల్‌జీ ప్రతినిధులు వీటిని ఆవిష్కరించారు. ఈ మెషీన్లు బట్టల బరువు, మురికిని గుర్తించి వాష్ సైకిల్‌ను నిర్ణయిస్తాయని, స్మార్ట్ కనెక్టివిటీ ద్వారా ఫోన్‌తో నియంత్రించవచ్చని నిర్వాహకులు తెలిపారు.


