News February 18, 2025
వినుకొండ: విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

వినుకొండలో విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని తారకరామ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా టైల్స్ పనులు నిమిత్తం నాలుగు నెలల క్రితం కార్మికులు వచ్చి పనులు నిర్వహిస్తున్నారు. సోమవారం టైల్స్ పని చేస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి పవన్ కుమార్ అనే యువకుడు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News November 13, 2025
బాల్య వివాహాలను నిర్మూలించడమే లక్ష్యం- కలెక్టర్ సంతోష్

బాల్య వివాహాలను నిర్మూలించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కలెక్టర్ సంతోష్ పిలుపునిచ్చారు. గురువారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జరిగిన ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 100 రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో, సమన్వయపూర్వకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
News November 13, 2025
జిల్లా వ్యాప్తంగా పోలీసుల క్రౌడ్ కంట్రోల్ మేనేజ్‌మెంట్‌పై అవగాహన

ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా క్రౌడ్ కంట్రోల్ మేనేజ్‌మెంట్, రోప్ పార్టీ విధులపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద ఉత్సవాలు, ఊరేగింపుల సమయంలో పోలీసులు చాకచక్యంగా స్పందించేలా రియల్‌టైమ్ డెమోలు నిర్వహించారు. ప్రజా భద్రత కోసం సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు.
News November 13, 2025
సూర్యాపేట: వేతనాలు విడుదల చేయాలి: పీఆర్టీయూ

2008 డీఎస్సీ కాంట్రాక్టు ఉపాధ్యాయుల వేతనాలు చెల్లించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తంగేళ్ల జితేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఉపాధ్యాయ వేతనాల విడుదలకు డైరెక్టరేట్ నుంచి విడుదలైన జీవోను డీటీఓకు అందజేశారు. ఎస్టీఓలకు ఆదేశాలు జారీ చేసి వేతనాలు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షుడు గోదేశి దయాకర్, ఫోరం అధ్యక్షుడు కోట రమేష్ పాల్గొన్నారు.


