News July 26, 2024
వినుకొండ హత్యపై మరోసారి స్పందించిన జగన్

వినుకొండలో జరిగిన రషీద్ హత్యపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి స్పందించారు. శుక్రవారం ఆయన తాడేపల్లి క్యాంపు ఆఫీసులో మాట్లాడారు. వినుకొండలో వైసీపీ నాయకుడిని దారుణంగా చంపారని, నిందితుడు జిలానీకి టీడీపీ నేతలలో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఆ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వినుకొండ ఘటనను దారి మళ్లీంచేందుకే మదనపల్లి ఇష్యూ తెచ్చారని జగన్ ఆరోపించారు.
Similar News
News November 10, 2025
గుంటూరు జిల్లా ప్రజలకు కలెక్టర్ సూచన

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం సోమవారం జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల ప్రధాన కార్యాలయాల్లో జరుగుతుందని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. https://Meekosam.ap.gov.inలో కూడా సమర్పించవచ్చని, అదేవిధంగా 1100 నంబర్‌కి డయల్ చేసి అర్జీ స్థితిని తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రజలు పీజీఆర్ఎస్‌ని సద్వినియోగం చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించారు.
News November 9, 2025
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద అప్టేట్

తాడేపల్లి పరిధి ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం ఉదయం ఇన్‌ఫ్లో 68,623 క్యూసెక్కులు ఉండగా దిగువకు 60,150 క్యూసెక్కులు, కేఈ మెయిన్ ద్వారా 3,238 క్యూసెక్కులు, కేడబ్ల్యు మెయిన్ 5,009 క్యూసెక్కులు, గుంటూరు ఛానెల్ ద్వారా 226 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటిమట్టం 12 అడుగులకు చేరినట్లు అధికారులు తెలిపారు.
News November 9, 2025
GNT: సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

సీఎం చంద్రబాబు నేడు పెదకాకానిలోని శంకర ఐ హాస్పిటల్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ చేసిన ఏర్పాట్లను కలెక్టర్ తమీమ్ అన్సారియా శనివారం పర్యటించి పరిశీలించారు. ఏర్పాట్లని పక్కాగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


