News October 30, 2025

విపత్కర పరిస్థితులలో జిల్లాను ముందుండి నడిపించిన కలెక్టర్, ఎస్పీ

image

మొంథా తుఫాను నుంచి బాపట్ల జిల్లాను రక్షించడంలో కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్ కీలక పాత్ర పోషించారు. తుఫాను ప్రభావం మొదలైనప్పటి నుంచి జిల్లా యంత్రాంగాన్ని వీరు ఉరుకులు పరుగులు పెట్టించారు. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లారు. ఫలితంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా నియంత్రించగలగడంలో ఈ ఇద్దరూ సఫలీకృతలయ్యారు. వీరిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.

Similar News

News October 30, 2025

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సెలవులు రద్దు

image

ఖమ్మం జిల్లాలో వర్ష ప్రభావం తగిన నేపథ్యంలో (రేపు) శుక్రవారం తిరిగి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ప్రారంభమవుతుందని ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని తుఫాను ప్రభావం తగ్గి వాతావరణం పొడిగా ఉన్నందున మార్కెట్ను తిరిగి రేపు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. కావున రైతాంగ సోదరులు గమనించి తమ పంటలను మార్కెట్‌కు తీసుకువచ్చి అమ్మకాలు జరపాలని అధికారులు పేర్కొన్నారు.

News October 30, 2025

రేపు స్కూళ్లకు సెలవు ఉంటుందా?

image

తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. APలోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని వరంగల్, హనుమకొండ, కరీంనగర్, సిద్దిపేట, జనగామ జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ప్రభావం తగ్గలేదు. దీంతో రేపు కూడా స్కూళ్లకు సెలవు ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

News October 30, 2025

ADB: ‘వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించాలి’

image

మోంథా తుఫాను ప్రభావంతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని TGVP రాష్ట్ర కార్యదర్శి కొట్టూరి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. మారుమూల గిరిజన గ్రామాల విద్యార్థుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జిల్లా ఉన్నతాధికారులు వెంటనే సెలవులు ప్రకటించే దిశగా దృష్టి సారించాలని ఆయన కోరారు. ఈ విజ్ఞప్తిలో ఆయన వెంట సతీశ్, సురేశ్ ఉన్నారు.