News September 23, 2025

విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి: కలెక్టర్

image

వరద విపత్తులు వస్తే సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత సర్పంచ్‌లు, అధికారులపై ఉందని కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం చెప్పారు. విపత్తును ఎదుర్కోవడానికి సర్పంచ్‌లు, అధికారులు సంసిద్ధం కావాలన్నారు. లంక గ్రామాల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా తాను అండగా ఉంటానన్నారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. సమాజంలో నాయకులుగా ఉన్న సర్పంచులు ప్రభుత్వంతో కలిసి పని చేయాలన్నారు.

Similar News

News September 24, 2025

హైడ్రా ప్రజావాణికి 49 ఫిర్యాదులు

image

నాలాల ఆక్రమణలపై హైడ్రా ప్రజావాణికి 49 ఫిర్యాదులు అందాయి. నాలాల కబ్జా కారణంగా వర్షం నీరు ఇళ్లలోకి చేరుతోందని ఫిర్యాదు చేశారు. చెరువులను కలిపే నాలాలు ఆక్రమణలకు గురికావడంతో వరద నీరు నేరుగా చెరువుల్లోకి వెళ్లడం లేదని, తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. చెరువుల‌ను అనుసంధానం చేస్తూ సాగే నాలాలు క‌బ్జాల‌కు గురి కావడంతో వ‌ర‌ద నేరుగా చెరువుకు వెళ్ల‌కుండా కాల‌నీల్లోకి వస్తుందని పేర్కొన్నారు.

News September 24, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 24, బుధవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.53 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.05 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.08 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.29 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.11 గంటలకు
✒ ఇష: రాత్రి 7.23 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 24, 2025

ఎర్రచందనం స్మగ్లరుకు 5 ఏళ్ల జైలు, రూ.6 లక్షల జరిమానా

image

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో తమిళనాడు ధర్మపురి జిల్లాకు చెందిన అండీకి ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.6లక్షల జరిమానా విధించారు. టాస్క్‌ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో కేసు విచారణ జరిపి నేరం రుజువుకావడంతో ఈ తీర్పు వెలువడింది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం నరికే నేరస్తులకు ఇది హెచ్చరికగా నిలుస్తుందని టాస్క్‌ఫోర్స్ ఎస్పీ అన్నారు.