News February 18, 2025

విభజన చట్టం పై చర్చకు పవన్ చొరవ చూపాలి: ఉండవల్లి

image

ఆంధ్రప్రదేశ్‌ను రాజ్యాంగ విరుద్ధంగా విభజన చేసి నేటికీ 11 సంవత్సరాలకుగాను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ధర్మంచర కమ్యూనిటీ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో కీలక పాత్రధారిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్లమెంట్లో విభజన చట్టంపై చర్చించేందుకు కేంద్రానికి నోటీసు ఇచ్చేలా చూడాలని ఉండవల్లి కోరారు. 

Similar News

News March 12, 2025

తూ.గో. జిల్లాకు ప్రత్యేక అధికారి

image

ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు బాధ్యతలను సీనియర్‌ IAS అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిగా ప్రవీణ్ కుమార్‌ను తూ.గో.జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ప్రభుత్వం కేటాయించింది. జోనల్ ఇన్‌ఛార్జ్‌గా అజయ్ జైన్‌ను నియమించింది. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

News March 12, 2025

రాజమండ్రి: జైలులో సరెండర్ కాని బోరుగడ్డ అనిల్

image

వైసీపీ నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు హాజరుకాకుండా గైర్హాజరయ్యారు. ఈ మేరకు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ రాజమండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తల్లిని చూసేందుకు కోర్టు ఇచ్చిన బెయిల్ గడువు నిన్న సాయంత్రం 5గంటలతో ముగిసింది. మరో గ్రేస్ పీరియడ్‌తో జైలు అధికారులు ఎదురుచూసినా అనిల్ రాకపోవడం గమనార్హం. దీనిపై ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

News March 11, 2025

తూ.గో.జిల్లా ప్రజలారా ఇవాళ జాగ్రత్త.!

image

తూ.గో.జిల్లా ఇవాళ వేడెక్కనున్నది. ముఖ్యంగా భానుడు తన ప్రతాపాన్ని జిల్లాలోని సీతానగరం 38.6, తాళ్లపూడి 38.5, గోపాలపురం 38.4, గోకవరం 38.3, కోరుకొండ 38.3, రాజమండ్రి 37.9, రాజానగరం 37.5, డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. కొన్ని ప్రాంతాల్లో వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కాబట్టి వృద్ధులు, పిల్లలు జాగ్రతగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

error: Content is protected !!