News October 11, 2025
విభజించు పాలించు విధానంలో HMDA ప్రణాళిక

HMDA ప్రాంతాన్ని మొత్తం 16 డివిజన్లుగా విభజించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని పాటించాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. HMDA 10, 472 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరణకు ప్రణాళిక రచిస్తున్న అధికారులు, ముందు చూపుతో ప్రత్యేక జోనింగ్ సిస్టం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫొటోస్ పెట్టినట్లు పేర్కొంది.
Similar News
News October 11, 2025
చేపల వినియోగం పెంపునకు ప్రాధాన్యం: మంత్రి టీజీ భరత్

చేపల వినియోగం పెంచేందుకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద యూనిట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. శనివారం నన్నూరు టోల్‌గేట్ వద్ద పాణ్యం ఎమ్మెల్యే చరిత, కలెక్టర్ డా.ఏ.సిరితో కలిసి చేపల విలువ ఆధారిత యూనిట్‌ను ప్రారంభించారు. మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యమని ఆయన చెప్పారు. రూ.50 లక్షలతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌లో 60శాతం సబ్సిడీ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.
News October 11, 2025
మద్యం కేసు నిందితులందర్నీ అరెస్టు చేస్తాం: మంత్రి కొల్లు

ములకలచెరువు కల్తీ మద్యం కేసులో ఇప్పటివరకు 23 మంది నిందితులను గుర్తించామని, వారిలో 14 మందిని అరెస్టు చేశామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఏ1గా ఉన్న జనార్దనావును కస్టడీలోకి తీసుకున్నామని, నాలుగు ప్రత్యేక బృందాలు హైదరాబాద్, బెంగళూరుతోపాటు ఏపీలోనూ దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు. త్వరలో APTATS యాప్ ద్వారా మద్యం బాటిళ్ల వివరాలు తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
News October 11, 2025
మద్యం కేసు నిందితులందర్నీ అరెస్టు చేస్తాం: మంత్రి కొల్లు

విజయవాడ: ములకలచెరువు కల్తీ మద్యం కేసులో ఇప్పటివరకు 23 మంది నిందితులను గుర్తించామని, వారిలో 14 మందిని అరెస్టు చేశామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఏ1గా ఉన్న జనార్దనావును కస్టడీలోకి తీసుకున్నామని, నాలుగు ప్రత్యేక బృందాలు హైదరాబాద్, బెంగళూరుతోపాటు ఏపీలోనూ దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు. త్వరలో APTATS యాప్ ద్వారా మద్యం బాటిళ్ల వివరాలు తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.