News November 6, 2025
విభిన్న ప్రతిభావంతులకు ఉచిత మూడు చక్రాల మోటార్ సైకిళ్లు

ఏలూరు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు పెట్రోల్‌తో నడిచే మూడు చక్రాల మోటార్ సైకిళ్లను ఉచితంగా అందిస్తున్నామని ఆ శాఖ జిల్లా మేనేజర్ రామ్ కుమార్ బుధవారం తెలిపారు. అర్హత గల 18 నుంచి 45 ఏళ్ల వారు www.apdascac.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు, ఇతర పత్రాలను నవంబర్ 25లోగా ఏలూరు కార్యాలయంలో అందించాలని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News November 6, 2025
పీలేరు కేంద్రగా రెవెన్యూ డివిజన్.!

మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పుంగనూరుకు బదులు పీలేరు కేంద్రగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు క్యాబినేట్ సబ్ కమిటీ ప్రతిపాదనలు తయారు చేసింది. ముందుగా పుంగనూరును రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు వినిపించాయి. కాగా పీలేరులో ఏఏ మండాలలు ఉంటాయో స్పష్టత రావాల్సి ఉంది.
News November 6, 2025
రెండో రోజూ ఏసీబీ సోదాలు

AP: రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 12 కార్యాలయాల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. డబుల్ రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్ల ట్యాంపర్‌లో ప్రైవేటు వ్యక్తుల పాత్ర ఉందని తెలుస్తోంది. లెక్కల్లో చూపని నగదును పెద్దమొత్తంలో అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
News November 6, 2025
ఫూట్ బాల్ రాష్ట్ర స్థాయి విజేత ఉమ్మడి మెదక్

వికారాబాద్‌లో జరిగిన స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్- 14 బాలికల విభాగంలో రాష్ట్రస్థాయి ఫూట్ బాల్ పోటీలో ఉమ్మడి మెదక్ జిల్లా జట్టు ప్రథమ స్థానం సాధించింది. ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు ఉమ్మడి పది జిల్లాల నుంచి వచ్చిన జట్లతో పోటీపడి విజేతగా నిలిచింది. విజయం సాధించిన బాలికల జట్టుకు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, స్కూల్ గేమ్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు.


