News March 21, 2024

విమానాలకు పక్షుల అంతరాయాన్ని నివారించేందుకు స్ప్రే డ్రోన్లు

image

విశాఖ విమానాల రాకపోకలకు పక్షులు అంతరాయాన్ని నివారించేందుకు తూర్పు నావికాదళంలో వైమానిక బృందం స్ప్రే డ్రోన్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఐఎన్‌ఎస్‌ డేగా నుంచి వీటి ఆపరేషన్స్‌ చేపడుతున్నారు. తద్వార పక్షులు ఎగరనీయకుండా నియంత్రించనున్నారు. ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న చెట్లపై నీటిని స్ప్రే చేస్తే.. రన్‌వే సమీపంలోకి పక్షులు రాకుండా నిలువరించగలమని భావిస్తున్నారు.

Similar News

News July 8, 2024

రుషికొండ భవనాల వాడుక నీరు శుద్ధికి రూ.2.5 కోట్లు..!

image

రుషి కొండపై నిర్మించిన విలాసవంతమైన భవనాల నుంచి వచ్చే వాడుక నీటిని శుద్ధి చేసేందుకు భారీ వ్యయంతో సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను నిర్మించారు. దీనిని నిర్మించినందుకు రూ.2.50 కోట్లు ఖర్చు చేశారు. దీనిని బీచ్ రోడ్డులోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం పక్కన నిర్మించారు. ఇందుకోసం అర కిలోమీటర్ మేర భూగర్భంలో పైపులైన్లను ఏర్పాటు చేశారు. అత్యంత విలువైన వీధి దీపాలను కూడా ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అయింది.

News July 8, 2024

విశాఖ: నేటి నుంచి ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు

image

ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న కౌన్సిలింగ్‌లో భాగంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ఆదివారంతో ముగిశాయి. వెబ్ ఆప్షన్లను సోమవారం నుంచి ఈనెల 12 వరకు ఎంపిక చేసుకోవాలని కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సూర్యనారాయణ ఆదివారం తెలిపారు. 13న వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చన్నారు. 16న సీట్ల కేటాయింపు 17 నుంచి 22 వరకు సెల్ఫ్ జాయినింగ్ రిపోర్టు చేయాలన్నారు. 19న క్లాసులు ప్రారంభమవుతాయన్నారు

News July 8, 2024

అనకాపల్లి: ప్రాణాలు తీసిన ఫొటోల సరదా

image

మాడుగుల మండలం తాచేరు ప్రాంతంలో ఫొటోలు దిగేందుకు వచ్చిన గుర్రం చందుమోహన్, గుబ్బల జ్ఞానేశ్వర్ అనే బావ బామ్మర్దులు నీటిలో మునిగి చనిపోయినట్లు ఎస్సై దామోదర్ నాయుడు తెలిపారు. తాచేరులో రాయిపై చందుమోహన్ నిల్చుని ఫొటో తీసుకుంటూ నీటిలో పడిపోగా.. అతనిని రక్షించేందుకు జ్ఞానేశ్వర్ నీటిలో దూకాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మరణించినట్లు పేర్కొన్నారు. మృతదేహాలను అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు.