News January 4, 2026
విమానాల్లో పవర్ బ్యాంక్ వినియోగంపై నిషేధం

లిథియం బ్యాటరీల వల్ల అగ్నిప్రమాదాలు సంభవించే ముప్పు ఉండటంతో విమాన ప్రయాణంలో పవర్ బ్యాంక్‌ల ద్వారా ఛార్జింగ్ చేయడాన్ని DGCA నిషేధించింది. పవర్ బ్యాంకులు, పోర్టబుల్ ఛార్జర్లు విమానాల్లో మంటలకు కారణమయ్యే అవకాశం ఉందని తాజా సర్క్యులర్‌లో పేర్కొంది. ముఖ్యంగా వీటిని ఓవర్‌హెడ్ బిన్లలో ఉంచినప్పుడు పొగ లేదా మంటలను గుర్తించడం కష్టమవుతుందని, ఇది విమాన భద్రతకు పెను ప్రమాదమని హెచ్చరించింది.
Similar News
News February 1, 2026
ప్రజాకర్షక పథకాల జోలికెళ్లని బడ్జెట్!

ఈసారి బడ్జెట్‌లో ప్రజాకర్షక పథకాలు పెద్దగా కనిపించలేదు. ముఖ్యంగా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ప్యాకేజీలు, ప్రత్యేక పథకాల వంటివేమీ ప్రకటించలేదు. కేవలం కొన్ని మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులనే కట్టబెట్టారు. వికసిత్ భారత్-2047 లక్ష్యంగా చేపట్టిన ఇనీషియేటివ్స్‌కు కొనసాగింపుగానే చాలా ప్రకటనలు ఉన్నాయి. పన్నుల విషయంలోనూ ఉద్యోగులను ఆకర్షించే పెద్ద అనౌన్స్‌మెంట్స్ లేవని నిపుణులు అంటున్నారు.
News February 1, 2026
అంబటి కుటుంబానికి భద్రత కల్పించాలి: హైకోర్టు

AP: మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబానికి 24 గంటలూ భద్రత కల్పించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. శాంతి భద్రతలు అదుపులోకి వచ్చేంతవరకు దీన్ని కొనసాగించాలని సూచించింది. అంబటి భార్య వేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై కోర్టు ఆదేశాలు జారీచేసింది. అంబటి ఇంటిపై దాడి కేసులో న్యాయస్థానం సీరియస్‌గా స్పందించింది.
News February 1, 2026
ఈసారి ఈ ‘శారీ’

బడ్జెట్ ప్రసంగం వేళ FM నిర్మలమ్మ ధరించిన కాంచీపురం చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో, వెండి తీగపై బంగారు పూత మెరిసే జరీతో దీనిని రూపొందించారు. కోర్వాయ్ పద్ధతిలో చీర, అంచులను విడివిడిగా నేసి బలంగా జత చేయడం వీటి ప్రత్యేకత. మూడు పట్టు దారాల కలయిక వల్ల ఇవి బరువుగా, దృఢంగా ఉంటాయి. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో అక్కడి సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ చీరను ఎంపిక చేశారనే <<19018918>>చర్చ<<>> సాగుతోంది.


