News January 28, 2026

విమాన ప్రమాదంపై నిష్పాక్షిక విచారణ జరగాలి: మమతా బెనర్జీ

image

మహారాష్ట్ర బారామతిలో విమానం కుప్పకూలిన ఘటనపై నిష్పక్షపాత విచారణ జరగాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ఏపీ సీఎం చంద్రబాబు సహా పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ప్రమాదంపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. ఇప్పటికే దర్యాప్తు బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

Similar News

News February 18, 2026

మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

image

AP: ప్రముఖ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తిరుపతిలో MBU వద్ద విద్యార్థి నాయకుల <<19041650>>కిడ్నాప్ కేసులో<<>> అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఫోన్ కాల్స్‌, మెసేజ్‌లను విశ్లేషించి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నివేదిక అందజేయాల్సి ఉందని, ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. క్వాష్ పిటిషన్‌పై విచారణను మార్చి 3కు వాయిదా వేసింది.

News February 18, 2026

వెంటిలేటర్‌పై సల్మాన్ ఖాన్ తండ్రి?

image

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తండ్రి, ప్రముఖ రచయిత <<19165776>>సలీమ్ ఖాన్<<>> (90) వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఉదయం అస్వస్థతకు గురవడంతో ముంబైలోని లీలావతీ ఆస్పత్రికి తరలించారు. రేపు ఉదయం ఆపరేషన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సలీమ్ ఖాన్ ఎన్నో హిట్ చిత్రాలకు కథ, మాటలు రాశారు.

News February 18, 2026

2050 నాటికి ఉద్యోగాలే ఉండవు: వినోద్ ఖోస్లా

image

AI ప్రభావంపై టెక్ బిలియనీర్ వినోద్ ఖోస్లా షాకింగ్ కామెంట్స్ చేశారు. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా మనుషులకు ఉద్యోగాల అవసరమే ఉండదని ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్’లో అన్నారు. IT సేవలు, BPO రంగాలు వచ్చే ఐదేళ్లలో పూర్తిగా కనుమరుగవుతాయని స్పష్టం చేశారు. మనిషి మేధస్సుతో చేసే పనులనే కాకుండా రోబోల సాయంతో శారీరక శ్రమను కూడా AI భర్తీ చేస్తుందన్నారు. ఫలితంగా విద్య, వైద్యం వంటి సేవలు ఉచితమవుతాయని పేర్కొన్నారు.