News January 28, 2026

విమాన ప్రమాదం.. ఎవరీ శాంభవీ పాఠక్!

image

<<18980548>>విమాన ప్రమాదం<<>>లో అజిత్ పవార్‌తో పాటు ఐదుగురు చనిపోవడం తెలిసిందే. వీరిలో కెప్టెన్ శాంభవీ పాఠక్ కూడా ఉన్నారు. ఆర్మీ ఆఫీసర్ కూతురైన శాంభవి ముంబై వర్సిటీలో Bsc పూర్తి చేశారు. న్యూజిలాండ్‌లో పైలట్ శిక్షణ తీసుకున్నారు. DGCA నుంచి లైసెన్స్ పొందారు. 2022 ఆగస్టు నుంచి <<18981334>>VSR వెంచర్స్‌<<>>లో ఫస్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. Learjet45 విమానాలు నడుపుతున్నారు. ప్రమాదంలో ఆమెతోపాటు కెప్టెన్ సుమిత్ కపూర్ కూడా మరణించారు.

Similar News

News February 13, 2026

వివిధ పంటల్లో తెగుళ్లు- నివారణకు సూచనలు

image

☛ మిరప, టమాటా, చిక్కుడు, ఆకుకూరల్లో ఆకుమచ్చ తెగుళ్ల నివారణకు లీటరు నీటికి కార్బండిజం 1గ్రా. లేదా మాంకోజెబ్ 2.5 గ్రా కలిపి పిచికారీ చేయాలి. ☛ బీర, కాకర, దోస, పొట్ల, సొరలో బూజుతెగులు నివారణకు లీటరు నీటికి డైమెథోమోర్ఫ్ 1.5గ్రా. కలిపి పిచికారీ చేసుకోవాలి. ☛ టమాటా, వంగ, క్యాప్సికంలో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా.+ప్లాంటామైసిస్ 2గ్రా కలిపి పిచికారీ చేయాలి.

News February 13, 2026

ముత్యం ఉంగరం ధరిస్తే?

image

ముత్యం చంద్ర గ్రహానికి ప్రతినిధి. ఇది మనస్సును భావోద్వేగాలను శాంతంగా ఉంచుతుంది. మేష, కర్కాటక, వృశ్చిక, మీన రాశుల వారు ముత్యం ధరించాలని జ్యోతిషులు సూచిస్తున్నారు. దీనివల్ల రాజయోగం పడుతుందని చెబుతున్నారు. ‘ఇది కోపాన్ని తగ్గించి, మానసిక స్పష్టతను, సంపదను ప్రసాదిస్తుంది. ముత్యాన్ని వెండి ఉంగరంలో పొదిగి, సోమవారం నాడు కుడిచేతి చిటికెన వేలికి ధరిస్తే ఆరోగ్య, ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది’ అంటున్నారు.

News February 13, 2026

ఆర్మీలో NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్

image

ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 124వ కోర్సు కోసం దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీతో పాటు NCC C సర్టిఫికెట్‌లో B గ్రేడ్ ఉన్నవారు మార్చి 16వరకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 76 పోస్టులు ఉన్నాయి. వయసు 19 – 25 ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్టింగ్, SSB, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు. www.joinindianarmy.nic.in