News October 21, 2024
విమ్స్‌లో రొమ్ము క్యాన్సర్‌కు ఉచిత వైద్య శిబిరం

విశాఖలోని విమ్స్‌లో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచిత రొమ్ము క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు సోమవారం ప్రకటన విడుదల చేశారు. శిబిరం నందు రొమ్ము క్యాన్సర్ నిర్ధారించే పరీక్షలను నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. >Share it
Similar News
News February 3, 2026
రూ.4180 కోట్లతో రేపు వార్షిక జీవీఎంసీ బడ్జెట్

జీవీఎంసీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను మేయర్ పీలా శ్రీనివాసరావు బుధవారం కౌన్సిల్ హాల్లో ప్రవేశపెట్టనున్నారు. ప్రారంభ నిల్వ రూ.365.96 కోట్లు కాగా, మొత్తం ఆదాయం రూ.4180.37 కోట్లు అంచనా వేశారు. అభివృద్ధి, నిర్వహణకు రూ.4047.12 కోట్ల ఖర్చు ప్రతిపాదించి, ముగింపు నిల్వగా రూ.133.25 కోట్లను నిర్ణయించారు. బడ్జెట్‌లో దేశంలో విశాఖ 10వ స్థానంలో నిలవడం తెలిసిందే.
News February 3, 2026
గాజువాక: సచివాలయ ఉద్యోగిని పట్టుకున్న ఏసీబీ

గాజువాకలోని 74వ వార్డులో సచివాలయం అడ్మిన్ కార్యదర్శి రూ.16 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం సాయంత్రం నిఘా పెట్టి ఏసీబీ అధికారులు దాడి చేశారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
News February 2, 2026
కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కు మత్స్యకారుల కృతజ్ఞతలు

బంగ్లాదేశ్ నుండి సురక్షితంగా స్వదేశం చేరుకున్న 9 మంది మత్స్యకారులు సోమవారం విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. విదేశీ వ్యవహారాల శాఖతో సమన్వయం చేసి, తమను ప్రాణాపాయం నుండి కాపాడినందుకు వారు భావోద్వేగానికి లోనయ్యారు. మత్స్యకారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్, భవిష్యత్తులో సరిహద్దుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


