News August 13, 2024
విలువలకు కట్టుబడి పోటీ చేయలేదు: హోం మంత్రి

విలువలకు కట్టుబడి ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖలో మాట్లాడుతూ.. గెలవాలనుకుంటే తాము ఈజీగా గెలుస్తామన్నారు. వైసీపీని వదిలి కూటమిలోకి చేరేందుకు పలువురు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వైఎస్ జగన్‌కు 58 మందితో భద్రత ఇస్తున్నామన్నారు. అలాగే జగన్ భార్యకు తల్లికి తగిన సెక్యూరిటీ కల్పించామన్నారు.
Similar News
News July 7, 2025
విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు

కోటబొమ్మాలి రైల్వే లైన్లో ఇంటర్ లాకింగ్ పనులు నేపథ్యంలో విశాఖ నుంచి బయలుదేరే పలు రైలు రద్దు చేసినట్లు వాల్తే డివిజన్ డీసీఎం సందీప్ సోమవారం తెలిపారు. విశాఖ -గుణుపూర్ (58505/06), విశాఖ -బరంపూర్ (58531/32), విశాఖ -భువనేశ్వర్ ఇంటర్ సిటీ (22819/20), విశాఖ- పలాస ప్యాసింజర్ (67289/90), విశాఖ -బరంపూర్ ఎక్స్‌ప్రెస్ (18525/26) రైళ్ళు జూలై 11న రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని సూచించారు.
News July 7, 2025
విశాఖ: ‘రాందేవ్ బాబాకు భూ కేటాయింపులు ఆపండి’

జీఓ 596కు విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ చేసిన 6లక్షల ఎకరాల భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తిరిగి ఎస్సీలకే కేటాయించాలని విదసం రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట రావు డిమాండ్ చేశారు. సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేశారు. శారదా పీఠం నుండి తీసుకున్న భూములు రామ్ దేవ్ బాబాకు ఇవ్వొద్దని, ఉమ్మడి విశాఖ జిల్లాలో భూ కుంభకోణాలపై వేసిన రెండు సిట్‌ల నివేదికలూ బయట పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
News July 7, 2025
విశాఖ: వైసీపీ ఎమ్మెల్సీకి బెయిల్ మంజూరు

వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిపై మహారాణిపేట పోలీసులు కేసు నమోదు చేయగా బెయిల్ మంజూరు అయింది. గత నెల 23వ తేదీన నిర్వహించిన వైసీపీ యువత పోరు కార్యక్రమంలో ఆమె పాల్గొనడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై నోటీసులు ఇవ్వడంతో ఇవాళ మహారాణిపేట సీఐ భాస్కరరావు ఎదుట ఆమె విచారణకు హాజరయ్యారు. కోర్టు మంజూరు చేసిన బెయిల్ పత్రాలను సీఐకు సమర్పించారు.