News April 14, 2025
‘విల్లా వెర్డే’ను ఆవిష్కరించిన సైబర్ సిటీ

హైదరాబాద్‌లో అల్ట్రా-లగ్జరీ లివింగ్ సౌకర్యాలతో విల్లా వెర్డే ప్రాజెక్టును సైబర్ సిటీ సంస్థ సోమవారం ప్రారంభించింది. ఇది టెర్రస్ స్విమ్ స్పాలు, బయోఫిలిక్ డిజైన్‌లు, IGBC-సర్టిఫైడ్ గ్రీన్ ఆర్కిటెక్చర్‌తో 89 బెస్పోక్ విల్లాలను కలిగిన ప్రత్యేక ప్రాజెక్టని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 20ఏళ్ల అనుభవంతో ఈ ప్రాజెక్టు అందిస్తున్నామన్నారు. ది చార్ కోల్ ప్రాజెక్టుతో కొలాబరేషన్‌ను ఈ లాంఛ్ ఈవెంట్లో ప్రకటించారు.
Similar News
News April 16, 2025
HYD: 1.30లక్షల మంది యువకుల దరఖాస్తు

నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకంపై నగర యువత ఆసక్తి చూపారు. నిన్నటితో గడువు ముగియడంతో ఎంత మంది దరఖాస్తు చేశారనే విషయం లెక్కతేలింది. 1.3 లక్షల మంది యువకులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 1,04,556 దరఖాస్తులు ఆన్‌లైన్‌లోకి రాగా 26,992 మంది ఆయా కార్యాలయాల్లో దరఖాస్తులు ఇచ్చారు.
News April 16, 2025
5 నిమిషాల్లో HYD జిల్లా చుట్టేయండిలా!

మీ జిల్లాలో జరిగిన అన్ని విషయాలు తెలుసుకునేందుకు Way2News యాప్‌లో ఇలా చేయండి. యాప్ ఓపెన్ చూస్తే రైట్ సైడ్ టాప్ మీ లొకేషన్ పేరుపై క్లిక్ చేయండి. పక్కన V సింబల్‌పై క్లిక్ చేస్తే 4 ఆప్షన్స్ మీ గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా చూపిస్తుంది. వాటిలో జిల్లాపై క్లిక్ చేస్తే 5MINలో మీ జిల్లా మొత్తం ఓ రౌండ్ వేయొచ్చు.
News April 15, 2025
ఉస్మానియా యూనివర్సిటీ PhD పరీక్షల తేదీలు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నిర్వహించే PhD పరీక్ష తేదీలను ప్రకటించింది. ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 27, 2025 వరకు జరగనున్నాయని, 3 రోజుల్లో రోజుకి మూడు సెషన్స్‌లలో సబ్జెక్టుల వారిగా తేదీలను ఇప్పటికే వర్సిటీ వెబ్‌సైట్‌లో వెల్లడించింది. దరఖాస్తు చేసిన అభ్యర్థులు https://www.ouadmissions.comలో తమ పరీక్ష తేదీని తెలుసుకోవచ్చని తెలిపింది.