News November 24, 2024

వివరాలు ఫోన్ ద్వారా సేకరించాలి: ఉప ముఖ్యమంత్రి భట్టి

image

డోర్ లాక్, వలస వెళ్లిన వారి వివరాలు ఫోన్ ద్వారా సేకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం కలెక్టర్‌తో మాట్లాడారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరికి దశకు చేరుకుందని, సర్వే డాటా ఎంట్రీ చాలా కీలకమైనదని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వవద్దని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News December 27, 2025

కరీంనగర్: ప్రాపర్టీ కేసుల్లో 50% ఛేదించారు..!

image

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో ప్రాపర్టీ కేసులు 505 నమోదయ్యాయి. ఇందులో 251 కేసులను పోలీసులు ఛేదించారు. 2025లో నష్టపోయిన ఆస్తి విలువ రూ. 4,11,98,269/-, ఇందులో రూ. 2,04,40,762/- విలువైన ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకొని బాధితులకు అందించారు. దీనితో రికవరీ శాతం 49.62%గా నమోదైంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే ఆస్తి రికవరీలో 24% పెరిగింది.

News December 27, 2025

కరీంనగర్‌: నూతన సర్పంచులను సన్మానించిన మంత్రి

image

ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సన్మానించారు. కరీంనగర్‌లోని డీసీసీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని, సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందేలా కృషిచేయాలని సూచించారు. MLAలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి ఉన్నారు.

News December 27, 2025

KNR కమిషనరేట్‌లో రౌడీలు ఎంతమంది ఉన్నారంటే ..?

image

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2024లో 578 హిస్టరీ షీట్స్ ఓపెన్ కాగా.. 2025లో 575 కేసులు నమోదు చేశారు. ఈ సంవత్సరం కొత్తగా 20 మందిపై కొత్తగా రౌడీ షీట్లు తెరవగా.. 362 సస్పెక్టెడ్ కేసులుగా నమోదయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే రౌడీల సంఖ్య స్వల్పంగా తగ్గింది. తరచుగా సీపీ గౌస్ ఆలం రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తూ శాంతి భద్రతలను కంట్రోల్‌లో ఉంచుతున్నారు.