News January 12, 2025
వివాదంలో MLA కొలికపూడి.. వివరణ కోరిన సీఎం
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఏ.కొండూరు మండలం గోపాలపురంలో అన్నదమ్ముల స్థల పంచాయితీ పరిష్కారానికి ఎమ్మెల్యే వెళ్లారు. అక్కడ 5వ వార్డు సభ్యురాలు భూక్యా చంటి ఇంట్లోకి వెళ్లి తిట్టి, కొట్టారని శనివారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన ఎమ్మెల్యే నుంచి వివరణ కోరినట్లు తాజాగా సమాచారం వెలువడింది.
Similar News
News January 12, 2025
కృష్ణా: భోగి మంట వేస్తున్నారా?
సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్ను వే2న్యూస్లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.
News January 12, 2025
పిల్లలకు నైతిక విలువలు నేర్పిస్తూ పెంచాలి: మంత్రి అనిత
మంత్రి అనిత శనివారం విజయవాడలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన సంక్రాంతి వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు నైతిక విలువలు నేర్పిస్తూ పెంచాలన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా ఉండేందుకు తర్వాతి తరంలో సామాజిక స్పృహ నింపాల్సిన బాధ్యత ప్రతి తల్లిపై ఉందన్నారు. బాలలకు క్రమశిక్షణ నేర్పేలా మొదటి పోలీసింగ్ తల్లి దగ్గరే మొదలవ్వాలన్నారు.
News January 12, 2025
విజయవాడ: ‘అప్పట్లో అరాచకాలు, ఇప్పుడు నీతులా?’
వైసీపీ ప్రభుత్వంలోనే ఇష్టానుసారంగా సంక్రాంతి సంబరాల పేరుతో క్యాసినోలు నిర్వహించిన ఘనత ఆ పార్టీ నేతలకే దక్కిందని తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు చింతల అనిల్ కుమార్ విమర్శించారు. శనివారం విజయవాడలో తన కార్యాలయంలో అనిల్ వైసీపీపై మండిపడ్డారు. ఆరు నెలల కూటమి పాలనలో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ఐదేళ్ల వైసీపీ కాలంలో ఆ పార్టీ నేతలు అరాచకాలు సృష్టించి, నేడు నీతులు వల్లించడం దారుణం అన్నారు.