News February 9, 2026
వివాదాస్పద బుక్.. లీకేజీపై దర్యాప్తు

లోక్‌సభలో <<19052501>>ప్రకంపనలు<<>> రేపిన ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణె ఆత్మకథ పుస్తకం ఎలా లీకైందనేదానిపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. FIR నమోదు చేసి PDF కాపీ ఎలా బయటికి వచ్చిందని ఆరా తీస్తున్నారు. చైనాతో ఉద్రిక్తతలకు సంబంధించి నిజాలు ఇందులో రాశారని రాహుల్ గాంధీ అంటున్నారు. ఈ పుస్తకం ఎప్పటికీ పబ్లిష్ కాదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ చెబుతున్నారు. కేంద్ర ఆమోదం లభించకపోవడంతో ఈ పుస్తకం పబ్లిషింగ్ నిలిచిపోయింది.
Similar News
News February 19, 2026
తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ నుంచి SIR!

దేశవ్యాప్తంగా SIR(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియకు EC సిద్ధమవుతోంది. వీటికి సంబంధించిన ఏర్పాట్లు త్వరగా పూర్తి చేసుకోవాలని AP, TG సహా 22 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ఎలక్టోరల్ ఆఫీసర్లకు లేఖ రాసింది. APR నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే బిహార్‌లో SIR పూర్తవగా, ప్రస్తుతం 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొనసాగుతోంది.
News February 19, 2026
విషాదం.. తేనెటీగల దాడిలో అంపైర్ మృతి

UP కాన్పూర్‌లో జరిగిన అండర్-13 మ్యాచులో విషాదం చోటుచేసుకుంది. మ్యాచ్ జరిగే సమయంలో తేనెటీగల గుంపు దాడి చేసింది. ఈ ఘటనలో అంపైర్ మాణిక్ గుప్తా (65) ప్రాణాలు కోల్పోయారు. ముఖం, శరీరం చుట్టూ పెద్దసంఖ్యలో తేనెటీగలు కుట్టడంతో ఆస్పత్రికి తరలించేలోపే మరణించారని అధికారులు వెల్లడించారు. మరో ఫీల్డ్ అంపైర్, 15-20 మంది ఆటగాళ్లు సైతం గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
News February 19, 2026
డీల్ చేసుకోండి.. లేదంటే దాడి తప్పదు: ట్రంప్

మిడిల్ ఈస్ట్‌లో అమెరికా భారీగా సైనిక బలగాలను <<19181534>>మోహరిస్తున్న<<>> వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తమతో అర్థవంతమైన డీల్ చేసుకోవాలని, లేదంటే దాడి తప్పదని పరోక్షంగా హెచ్చరించారు. ‘బోర్డ్ ఆఫ్ పీస్’ మీటింగ్‌లో మాట్లాడుతూ ‘ఇరాన్‌తో డీల్ సులభం కాదని తేలిపోయింది. డీల్ జరగకపోతే పర్యవసానాలు తప్పవు. మరో 10 రోజుల్లోనే దాన్ని తెలుసుకుంటారు’ అని వార్నింగ్ ఇచ్చారు.


