News August 8, 2024

వివేక హత్య కేసుపై.. కడప SPని కలిసిన YS సునిత

image

కడప ఎస్పీ హర్షవర్ధన్‌ రాజును వివేకా కుమార్తె సునీతరెడ్డి బుధవారం కలిశారు. తన తండ్రి హత్య కేసుకు సంబంధించి ఎస్పీతో సునీత చర్చించారు. గత ప్రభుత్వంలో తన తండ్రి హత్య కేసులో సీబీఐకి, తమకు పోలీసులు సహకరించలేదని, స్థానిక పోలీసులు నిందితులకు అండగా నిలిచారన్నారు. ఈ కేసులో తప్పుచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ సమయంలో స్థానిక పోలీసులు కేసును నీరుగార్చేలా వ్యవహరించారని అన్నారు.

Similar News

News November 6, 2025

జమ్మలమడుగు: తండ్రి, కుమార్తెకు జైలుశిక్ష

image

జమ్మలమడుగులోని నాగులకట్ట వీధికి చెందిన గంజి మాధవి(32) బీసీ కాలనీకి చెందిన మునగాల రవి(35) దగ్గర రూ.5లక్షలు అప్పు తీసుకుంది. డబ్బులు తిరిగి ఇవ్వాలని రవి ఒత్తిడి చేయడంతో అతడిపై ఆమె కక్ష పెంచుకుంది. 2017 జనవరి 19న నాగులకట్ట వీధిలో తన తండ్రి సూర్యనారాయణ రెడ్డి(65)తో కలిసి రవిని ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేసింది. నేరం నిరూపణ కావడంతో మాధవి, సూర్యనారాయణకు కోర్టు తాజాగా జీవిత ఖైదు విధించింది.

News November 6, 2025

22 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు: జేసీ

image

జిల్లాలో వరి రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు 22 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ తెలిపారు. సాధారణ రకం వరికి క్వింటాకు రూ. 2,369, ఏ-గ్రేడ్ రకానికి రూ. 2,389 ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఈ-క్రాప్, ఈ-కేవైసీతో పాటు తమ పేర్లను నమోదు చేసుకున్న రైతులు మాత్రమే కొనుగోలుకు అర్హులని ఆమె తెలిపారు.

News November 5, 2025

ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్: ఎస్పీ

image

ప్రొద్దుటూరులో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 6 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తూ, పదుల సంఖ్యలో ఫేక్ కరెంట్ బ్యాంక్ అకౌంట్లు తెరిచి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్టు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. ఈ ముఠా నుంచి రూ.6.28 లక్షల నగదు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.