News October 18, 2025

విశాఖకు గూగుల్ రాక శుభపరిణామం: ఎంపీ శబరి

image

గూగుల్ టెక్ సంస్థ విశాఖకు రావడం నవ్యాంధ్రప్రదేశ్‌కు శుభసంకేతమని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. శనివారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలను హైదరాబాదుకు ఆహ్వానించిన చంద్రబాబు ఇప్పుడు నవ్యాంధ్ర ముఖచిత్రాన్ని మారుస్తున్నారని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సీఎం చేస్తున్న కృషి ప్రశంసనీయమని తెలిపారు.

Similar News

News October 18, 2025

మెదక్: ’25లోగా IFMIS పోర్టర్‌లో నమోదు చేయాలి’

image

మెదక్ జిల్లా అధికారులు, డీడీఓలు తమ పరిధిలోని శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల ఆధార్, పాన్, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ వివరాలను ఈ నెల 25లోగా IFMIS పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఖజానా అధికారి అనిల్ కుమార్ మరాఠి ఆదేశించారు. వివరాలు నమోదు చేయని పక్షంలో అక్టోబర్-2025 మాసానికి సంబంధించిన జీతాలు/గౌరవ వేతనాలు అందవని ఆయన స్పష్టం చేశారు.

News October 18, 2025

ఇతిహాసాలు క్విజ్ – 39 సమాధానాలు

image

1. క్షీరసాగర మథనం సమయంలో అమృతంతో ఉద్భవించిన దేవతల వైద్యుడు ధన్వంతరి.
2. జమదగ్ని మహర్షి కుమారుడిగా పుట్టిన విష్ణు అవతారం ‘పరుశరాముడు’.
3. కాలానికి, వినాశనానికి దేవతగా కాళీ మాతను పరిగణిస్తారు.
4. క్షీరసాగర సమయంలో మొదట కాలకూట విషం వచ్చింది.
5. ఇంద్రుడి రాజధాని ‘అమరావతి’. <<-se>>#Ithihasaluquiz<<>>

News October 18, 2025

పెళ్లి చేసుకున్న ‘దంగల్’ నటి

image

‘దంగల్’ సినిమా ఫేమ్ జైరా వసీమ్ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తన భర్త ఫేస్‌ను రివీల్ చేయకుండా ఓ ఫొటోను షేర్ చేశారు. ‘దంగల్‌’ మూవీలో నటనకుగాను నేషనల్ అవార్డు అందుకున్న ఆమె బాలీవుడ్‌లో ‘సీక్రెట్ సూపర్ స్టార్, ది స్కై ఈజ్ పింక్’ వంటి సినిమాల్లో నటించారు. మత విశ్వాసాల కారణంగా 2019లో ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరమయ్యారు. తాజాగా పెళ్లి వార్తతో ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు.