News December 27, 2025
విశాఖకు భారీగా పర్యాటకులు.. నో రూమ్స్

విశాఖ అందాలకు పర్యాటకులు ఖుషీ అవుతున్నారు. ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ సందర్శకులతో విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని సందర్శనయ స్థలాలు కిక్కిరిసిపోయాయి. నగరం, పరిసర ప్రాంతాల్లోని హోటళ్ళు, లాడ్జిలు చివరికి కళ్యాణ మండపాల్లో ఉండే గదులు సైతం సందర్శకులతో నిండిపోయాయి. కొద్ది రోజులుగా టూరిస్టులకు గదులు దొరకడం గగనం అయిపోతుంది. ఉదయం పూట మంచుతో పూర్తిగా కప్పబడి సందర్శకులకు ప్రకృతి అందాలతో కనువిందు చేస్తోంది.
Similar News
News December 27, 2025
జిల్లాలో 4.86 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు దగ్గర పడ్డాయి. ఇప్పటివరకు 4.86 లక్షల మెట్రిక్ పనుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 392 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా 85,175 మంది రైతుల నుంచి రూ.1158 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యంలో రైతులకు ఇప్పటివరకు రూ.1078 కోట్లు చెల్లించారు. సాగర్, దేవరకొండ నియోజకవర్గాలలో కొన్నిచోట్ల ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి.
News December 27, 2025
మేడారం దేవాదాయ శాఖ కిందకు రాదా ?

మేడారం మహా జాతరలో భాగంగా రూ.251 కోట్ల వ్యయంతో వన దేవతల గద్దెల ప్రతిష్ఠాపనతో పాటు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇలాంటి ఆదివాసీ ఇలవేల్పుల జాతరపై దేవాదాయ శాఖ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. తరచూ రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రులే రివ్యూ చేస్తుండగా, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాత్రం దూరంగా ఉండటంతో మంత్రుల మధ్య గ్యాప్ ఇంకా పోలేదా? అనే సందేహాలు వస్తున్నాయి.
News December 27, 2025
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 20 గంటలు

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. నిన్న మొత్తం 72,487 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 29,500 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.52 కోట్లు వచ్చింది. వరుస సెలవుల కారణంగా తిరుమలలో రద్దీ పెరిగింది.


