News July 28, 2024
విశాఖకు రానున్న రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్

ఈనెల 30న బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ కేసలి అప్పారావు, సభ్యుడు గొండు సీతారాం విశాఖ వస్తున్నట్లు కమిషన్ కార్యదర్శి కలెక్టరేట్‌కు సమాచారం అందించారు. ఆరోజు ఉదయం కేజీహెచ్‌లో నిర్వహించే అనధికార దత్తత-చట్ట ప్రకారం చర్యలు అనే అంశంపై ప్రసంగిస్తారని అన్నారు. మధ్యాహ్నం ఎంవీపీ కాలనీలో మాదకద్రవ్యాలపై నిర్వహించే అవగాహన సదస్సులో పాల్గొంటారని చెప్పారు.
Similar News
News September 24, 2025
21 వెండింగ్ జోన్లు గుర్తింపు: యూసీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్యవేణి

విశాఖలో 21 వెడింగ్ జోన్లను గుర్తించామని జీవీఎంసీ యూసీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్యవేణి తెలిపారు. ఇంకా మరికొన్ని గుర్తించాలని నిర్ణయించామన్నారు. యూసీడీ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో వీధి విక్రయదారుల అర్హత సర్వే 90% పూర్తయిందని తెలిపారు. బీపీఎల్ కేటగిరీ, స్ట్రీట్ వెండర్ గుర్తింపు ఉండాలన్నారు. వీరికి వెండింగ్ జోన్లలో దుకాణాలు కేటాయిస్తామన్నారు.
News September 23, 2025
కార్పొరేటర్లు టూర్‌లో.. మేము బతుకు కోసం పోరులో!

విశాఖలో ‘ఆపరేషన్ లంగ్స్-2.0’ పేరుతో GVMC ఆక్రమణలను తొలగిస్తున్న విషయం తెలిసిందే. దీంతో తమ ఉపాధి కోల్పోయామంటూ చిరు వ్యాపారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. తమ కష్టాలను తీరుస్తారని గెలిపించిన కార్పొరేటర్లు మాత్రం ఈ కష్ట సమయంలో తమను గాలికొదిలేసి విహార యాత్రలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు చెప్పుకుందామంటే ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదని వాపోయారు.
News September 23, 2025
విశాఖలో రెండో రోజు జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు

నగరంలోని నోవాటెల్ హోటల్‌లో 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు రెండో రోజు కొనసాగింది. సదస్సులో భాగంగా ‘సివిల్ సర్వీసెస్ & డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్’ అంశంపై మూడో ప్లీనరీ సెషన్ నిర్వహించారు. ఈ సెషన్‌కు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సెక్రటరీ రష్మీ చౌదరి ప్రధాన వక్తగా వ్యవహరించారు. చర్చలో పలు రాష్ట్రాల ఉన్నతాధికారులు పునీత్ యాదవ్, మోహన్ ఖంధార్, అహ్మద్ బాబు, ఎస్.సాంబశివరావు, పీయూష్ సింగ్లా పాల్గొన్నారు.