News December 29, 2025
విశాఖకు 150 పర్యావరణహిత బస్సులు

కేంద్ర ప్రభుత్వ ‘పీఎం-ఈబస్ సేవ’ పథకం కింద రాష్ట్రానికి 750 విద్యుత్ బస్సులు కేటాయించగా.. ఇందులో విశాఖపట్నం నగరానికే అత్యధికంగా 150 బస్సులను అందిచనుండడం విశేషం. ఈ మేరకు ఆపరేటర్లను ఖరారు చేసేందుకు ఈఈఎస్ఎల్ (EESL) సంస్థ ఆర్టీసీకి లెటర్ ఆఫ్ అవార్డు జారీ చేసింది. త్వరలోనే పర్యావరణ హితమైన ఈ ఎలక్ట్రిక్ బస్సులు వైజాగ్ రోడ్లపై పరుగులు తీయనున్నాయి.
Similar News
News December 31, 2025
ప్రసాదంలో నత్తపై ప్రశ్నిస్తే కేసులా?: కేకే రాజు

సింహాచలం ప్రసాదంలో నత్త రావడంపై ప్రశ్నించిన భక్తులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడాన్ని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు మండిపడ్డారు. రాష్ట్రంలో భారత రాజ్యాంగానికి బదులుగా ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అమలవుతోందని ఆయన ధ్వజమెత్తారు. ఆలయాలను రాజకీయ వేదికలుగా మార్చడం వల్లే నిర్వహణ అస్తవ్యస్తమైందని, భక్తులను కేసులతో భయపెట్టడం దారుణమన్నారు.
News December 31, 2025
విశాఖ: ప్లాస్టిక్ కవర్ కనిపిస్తే చాలు.. రూ.2,000 ఫైన్!

ఎంవీపీ కాలనీ సెక్టర్-9 చేపల మార్కెట్లో ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై సూపర్వైజర్ సత్తిబాబు, సానిటరీ ఇన్స్పెక్టర్ రవి ఆకస్మిక తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ వాడుతున్న వారికి రూ.2000 జరిమానా విధించారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్లాస్టిక్ సంచులను పూర్తిగా నిషేధించాలని, మళ్లీ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు.
News December 31, 2025
ఎంవీపీ కాలనీ: గంజాయి, డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్

ఎంవీపీ కాలనీ లాస్యన్స్ బే జంక్షన్‌లో స్కూటీ మీద ముగ్గురు వ్యక్తులు గంజాయి డ్రగ్స్ తీసుకువెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోడవరం, అనకాపల్లి, ఇసుకతోట ప్రాంతాలకు చెందిన ఈ ముగ్గురు యువకులు స్కూటీపై ఐదు కేజీలు గంజాయి, 5 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ తరలిస్తుండగా పట్టుబడ్డారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరికి గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు.


