News April 24, 2025
విశాఖను అమ్మేస్తున్నారు: కేశినేని నాని

ఉర్సా క్లస్టర్ సంస్థలకు భూకేటాయింపులపై విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తాను చేసిన విమర్శలను సమర్ధించుకున్నారు. ఎవరు ఎన్ని జూమ్ మీటింగులు పెట్టి వివరణలు ఇచ్చినా “Vizag is for sale” అంటూ గురువారం నాని ట్వీట్ చేశారు. తనను ఎన్ని బూతులు తిట్టినా, చిప్ పోయిందని, సైకో అన్నా తనకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదని.. విశాఖలో ఇటీవల జరిపిన భూకేటాయింపులు సక్రమంగా లేవని నాని ఆరోపించారు.
Similar News
News April 24, 2025
మద్నూరులో అత్యధిక ఉష్ణోగ్రతలు

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గురువారం మద్నూర్, రామారెడ్డిలో 44.8, పల్వంచలో 44.7, జుక్కల్, బాన్సువాడ, డోంగ్లిలో 44.6, నస్రుల్లాబాదులో 44.5, బిచ్కుందలో 44.4, దోమకొండలో 44.1, లింగంపేటలో 43.9, అత్యల్పంగా బీబీపేట మండలంలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయట తిరగవద్దని అధికారులు సూచించారు.
News April 24, 2025
పంగులూరులో రోడ్డు ప్రమాదం

బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం జాగర్లమూడివారిపాలెం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. గురువారం స్థానికుల వివరాల మేరకు.. ఓ కారు కలకత్తా నుంచి తమిళనాడు వెళ్లే క్రమంలో లారీని క్రాస్ చేస్తుండగా లారీ ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 24, 2025
ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు

AP: రాష్ట్రంలోని 4 ట్రిపుల్ ఐటీ క్యాంపస్ (నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం)లలో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజైంది. ఏప్రిల్ 27 నుంచి మే 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పదో తరగతి మార్కుల ఆధారంగా 6 ఏళ్ల బీటెక్ కోర్సులో నేరుగా ప్రవేశాలు ఉంటాయి. అప్లికేషన్ ఫీజు రూ.300. దరఖాస్తు చేసుకోవాల్సిన సైట్: http://www.rgukt.in/