News July 24, 2024

విశాఖను కాలుష్యం నుంచి కాపాడతా: పవన్ కళ్యాణ్

image

విశాఖలో పలు కంపెనీలు నిబంధనలు పాటించకపోవడంతో పర్యావరణం దెబ్బతింటుందని స్థానిక MLAలు అసెంబ్లీ సమావేశంలో ప్రశ్న లేవనెత్తారు. మంత్రి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాక స్పీకర్ అయ్యన్న కలగజేసుకుని సభ్యులు చెప్పింది నిజమేనని విశాఖలో ఒకసారి పర్యటించాలని పవన్‌కు సూచించారు. కాలుష్యం నుంచి విశాఖను కాపాడాలని తపనపడే వ్యక్తులలో తానూ ఒకడినని.. సంబంధిత అధికారులతో చర్చించి విశాఖను కాలుష్యం నుంచి కాపాడతానన్నారు.

Similar News

News September 24, 2025

అసెంబ్లీ సమావేశాలు ముగియగానే సమస్యకు పరిష్కారం: వంశీకృష్ణ

image

విశాఖలో తొలగించిన స్ట్రీట్ వెండర్స్, ఫుడ్ కోర్ట్ వర్తకుల వ్యాపారాలను తిరిగి ఏర్పాటు చేయిస్తానని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ బుధవారం హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే వారి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. వెండర్ కార్డులు ఇచ్చి చట్టబద్ధంగా వ్యాపారాలు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం చిరువర్తులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

News September 24, 2025

కార్పొరేటర్లు టూర్‌లో.. మేము బతుకు కోసం పోరులో!

image

విశాఖలో ‘ఆపరేషన్ లంగ్స్-2.0’ పేరుతో GVMC ఆక్రమణలను తొలగిస్తున్న విషయం తెలిసిందే. దీంతో తమ ఉపాధి కోల్పోయామంటూ చిరు వ్యాపారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. తమ కష్టాలను తీరుస్తారని గెలిపించిన కార్పొరేటర్లు మాత్రం ఈ కష్ట సమయంలో తమను గాలికొదిలేసి విహార యాత్రలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు చెప్పుకుందామంటే ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదని వాపోయారు.

News September 24, 2025

21 వెండింగ్ జోన్లు గుర్తింపు: యూసీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్యవేణి

image

విశాఖలో 21 వెడింగ్ జోన్లను గుర్తించామని జీవీఎంసీ యూసీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్యవేణి తెలిపారు. ఇంకా మరికొన్ని గుర్తించాలని నిర్ణయించామన్నారు. యూసీడీ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో వీధి విక్రయదారుల అర్హత సర్వే 90% పూర్తయిందని తెలిపారు. బీపీఎల్ కేటగిరీ, స్ట్రీట్ వెండర్ గుర్తింపు ఉండాలన్నారు. వీరికి వెండింగ్ జోన్లలో దుకాణాలు కేటాయిస్తామన్నారు.