News August 13, 2025
విశాఖను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చుదిద్దుదాం: కలెక్టర్

విశాఖను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చుదిద్దదామని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞలో భాగంగా కలెక్టరేట్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. యువత పెద్ద సంఖ్యలో మాదక ద్రవ్య నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని కోరారు.
Similar News
News August 13, 2025
సాగర్ నగర్ బీచ్ సమీపంలో అపస్మారక స్థితిలో వ్యక్తి

ఆరిలోవ స్టేషన్ పరిధి సాగర్ నగర్ రాడిసన్ బ్లూ హోటల్ సమీపంలో బీచ్ దగ్గర పొదల్లో ఓ వ్యక్తి అపస్మారకస్థితిలో పడి ఉన్నట్లు ఆరిలోవ పోలీసులు తెలిపారు. స్థానికులు 108 సమాచారం ఇవ్వగా కేజీహెచ్‌కి తరలించినట్లు వెల్లడించారు. ఆ వ్యక్తి పాయిజన్ తీసుకున్నట్లు అనుమానిస్తున్నామన్నారు. ఈ వ్యక్తి బంధువులు ఎవరైనా ఉంటే ఆరిలోవ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సిఐ మల్లేశ్వరరావు సూచించారు.
News August 13, 2025
స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన సీపీ

విశాఖ వన్ టౌన్ ఏఆర్ గ్రౌండ్స్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను సీపీ శంఖబ్రత బాగ్చీ పరిశీలించారు. వీవీఐపీ భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది కవాతును సమీక్షించారు. జెండా వందనం, వందన సమర్పణ పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రముఖులు, స్వాతంత్ర సమరయోధులు, అధికారులు, ప్రజలు కూర్చునే గ్యాలరీలను పరిశీలించారు.
News August 13, 2025
VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్‌పై కేసు కొట్టివేత

VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్‌పై ఛలో రుషికొండ కార్యక్రమంలో పోలీసులు పెట్టిన కేసులు విశాఖ జిల్లా కోర్టు జడ్జి ప్రదీప్ కుమార్ కొట్టివేశారు. వైసీపీ ప్రభుత్వం హయంలో ఛలో రుషికొండ కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. అప్పట్లో TNSF రాష్ట్ర అధ్యక్షుడిగా రుషికొండ వెళ్లి నిరసన తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు శోభన్ బాబు, పార్థసారథి వాదనలు వినిపించారు.