News January 5, 2025

విశాఖలోనే మంత్రుల మకాం

image

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలకడంతో పాటు ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు కూటమి నాయకులు కసరత్తు చేస్తున్నారు. మంత్రులు నారా లోకేశ్, అనిత, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి విశాఖలోనే మకాం వేశారు. ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.

Similar News

News January 7, 2025

విశాఖలో ప్రధాని మోదీ షెడ్యూల్

image

ఈనెల 8న విశాఖకు ప్రధాని మోదీ రానున్న సంగతి తెలిసిందే. సాయంత్రం 4:15కు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 4:45 నుంచి 5:30వరకు వేంకటాద్రి వంటిల్లు నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ వరకు రోడ్‌షోలో పాల్గొంటారు. 5:30 నుంచి 6:30వరకు ఏయూ గ్రౌండ్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 6:35కు రోడ్డు మార్గాన బయలుదేరి 6:55కు ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని భువనేశ్వర్ పయనమవుతారు.

News January 7, 2025

విశాఖలో ప్రధాని పర్యటన.. డ్రోన్ కెమెరాలపై ఆంక్షలు

image

పీఎం నరేంద్ర మోదీ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి డ్రోన్ కెమెరాలపై ఆంక్షలు విధించారు. నగరంలో ప్రధాని రోడ్ షో, బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో డ్రోన్ కెమెరాలు కలిగి ఉన్న వారు ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్స్, ప్రధాని పర్యటించే పరిసర ప్రాంతాలలో 5 కిలోమీటర్ల మేర డ్రోన్ కెమెరాలు వినియోగం నిషేధమని తెలిపారు. నిషేదాజ్ఞలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులకు శిక్షార్హులు అవుతారన్నారు.

News January 6, 2025

విశాఖలో ప్రధాని పర్యటన.. డ్రోన్ కెమెరాలపై ఆంక్షలు

image

పీఎం నరేంద్ర మోదీ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి డ్రోన్ కెమెరాలపై ఆంక్షలు విధించారు. నగరంలో ప్రధాని రోడ్ షో, బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో డ్రోన్ కెమెరాలు కలిగి ఉన్న వారు ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్, ప్రధాని పర్యటించే పరిసర ప్రాంతాలలో 5 కిలోమీటర్ల మేర డ్రోన్ కెమెరాలు వినియోగం నిషేధమన్నారు. నిషేదాజ్ఞలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులకు శిక్షార్హులు అవుతారన్నారు.