News October 2, 2025

విశాఖలో అంగన్వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తుల అహ్వానం

image

విశాఖలో 53 అంగన్వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ICDS పీడీ రామలక్ష్మి తెలిపారు. భీమునిపట్నం జోన్‌లో 11, పెందుర్తిలో 21, విశాఖలో 21 ఖాళీలు ఉన్నాయన్నారు. 7వ తరగతి పాస్ అయి 21-35 ఏళ్ల లోపు గల స్థానిక వివాహితులు ఈ పోస్టులకు అర్హులుగా పేర్కొన్నారు. దరఖాస్తులను ఈనెల 3వ తేదీ నుంచి 14వ తేదీ వరకు స్వీకరించనున్నామన్నారు.

Similar News

News October 2, 2025

గోపాలపట్నంలో విచ్చలవిడిగా నాన్‌వెజ్ అమ్మకాలు

image

గాంధీ జయంతి సందర్భంగా నేడు మాంసాహారం దుకాణాలు తెరవొద్దని అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే దసరా కావడంతో గోపాలపట్నం ప్రాంతంలో చికెన్, మటన్ షాపుల యజమానులు బహిరంగంగానే గురువారం అమ్మకాలు జరుపుతున్నాయి. అధికారులు ప్రకటనలతోనే సరిపెట్టుకుంటున్నారని, చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

News October 2, 2025

విశాఖ: భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

విశాఖలో భారీ నుంచి అతిభారీ వర్షాల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. విశాఖ కలెక్టర్ ఆఫీస్ కంట్రోల్ రూమ్ 0891-2590100, 0891-2590102 నంబర్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా విశాఖ రెవెన్యూ డివిజనల్ అధికారి నంబర్ 8500834958, బీమిలి రెవెన్యూ డివిజనల్ అధికారి నంబర్ 8074425598 అందుబాటులో తీసుకువచ్చినట్లు బుధవారం వెల్లడించారు.

News October 1, 2025

విశాఖ జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారిగా ఉమారాణి

image

విశాఖ ఇంటర్ బోర్డు జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారిణిగా ఉమారాణి నియామకం అయ్యారు. ఇంతవరకు ఈ పదవిలో ఉన్న మజ్జి ఆదినారాయణ పదవీ విరమణ చేయడంతో ఈమెను ఇంటర్ విద్యాశాఖ కార్యదర్శి నియమించారు. దీంతో బుధవారం ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఈమె ఇంతవరకు చోడవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహించారు.