News August 18, 2025

విశాఖలో అంగన్వాడీ కేంద్రాలకు సెలవు లేదా?

image

అల్పపీడనం నేపథ్యంలో విశాఖలో అనేక ప్రాంతాలు జలమయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు సోమవారం ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. అయితే అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ఇవ్వకపోవడంతో ఏదో విధంగా తల్లిదండ్రులు చిన్నారులను పంపిస్తున్నారు. స్కూల్, కాలేజీలు సెలవులు ఇచ్చి అంగన్వాడీలకు ఇవ్వకపోవడంతో చిన్నారులకు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

Similar News

News August 18, 2025

అధికారులతో విశాఖ ఇన్‌ఛార్జ్ మంత్రి భేటీ

image

విశాఖ సర్క్యూట్ గెస్ట్ హౌస్‌లో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డా.డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి జిల్లా ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పాల్గొన్నారు. రెండు రోజులుగా విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తీసుకున్న చర్యలపై సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలపై ఆరా తీశారు. అనంతం గీతం కాలేజీకి బయలుదేరి వెళ్లారు.

News August 18, 2025

విశాఖలో అర్ధరాత్రి వ్యక్తిపై గన్‌తో కాల్పులు

image

విశాఖ వన్‌టౌన్ పరధిలో ఆదివారం అర్ధరాత్రి గన్‌తో కాల్పుల ఘటన కలకలం రేపింది. చిలకపేటలో నివాసం ఉంటున్న రాజేశ్‌పై నూకరాజు అనే వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. మద్యం మత్తులో వీరి మధ్య వివాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బాధితుడు ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. అతని ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతని వద్దకు గన్ ఎలా వచ్చిందో తెలియాల్సి ఉంది.

News August 18, 2025

విశాఖ: బాలుడి మృతి.. నిందితుడి కారులో గంజాయి

image

కంచరపాలెంలో ఆగస్టు 12న కారు ఢీకొని <<17386606>>బాలుడు మృతి<<>> చెందిన ఘటనలో తమిళనాడుకు చెందిన నిందితుడు అర్జునన్‌ను పోలీసులు రిమాండ్‌కు పంపారు. అతను విజయవాడలో కారును అద్దెకు తీసుకుని అరకులో21kgల గంజాయి కొని వస్తుండగా యాక్సిడెంట్ అయ్యింది. ఘటన జరిగిన రోజు స్థానికులు అతనికి దేహశుద్ధి చేయగా..తాళాలు పోయాయి. విజయవాడ నుంచి తాళాలు తెప్పించి ఆదివారం తనిఖీ చేయగా కారులో గంజాయి ఉన్నట్లు గుర్తించామని CI రవికుమార్ తెలిపారు.