News February 25, 2025

విశాఖలో ఆధార్ కార్డు లేని చిన్నారులు 3,200 మంది 

image

విశాఖలో వార్డు సచివాలయాల్లో, కామన్ సర్వీస్ సెంటర్‌లో, పోస్ట్ ఆఫీస్‌లో ఈనెల 28 వరకు ఆధార్ సెంటర్‌లు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ హరేంధీర ప్రసాద్ సోమవారం తెలిపారు. జిల్లాలో 3,200కు పైగా పిల్లలు బర్త్ సర్టిఫికెట్ ఉండి కూడా బాలాధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోలేదన్నారు. వారందరూ ఈఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకునేలా అంగన్వాడి కేంద్రాల సూపర్‌వైజర్స్ వారి తల్లిదండ్రులకు వివరించాలని ఆదేశించారు.

Similar News

News February 25, 2025

మార్చి 29తో ముగియనున్న ఎమ్మెల్సీ పదవీ కాలం

image

టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. టీడీపీలో అంచెలంచెలుగా ఎదిగిన రామారావు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2019లో ఎమ్మెల్యే కోటాలో దువ్వారపు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఈ స్థానం ఖాళీ కానుంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలోని 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ జారీ చేసింది. ఈయన స్థానంలో పార్టీ ఎవరి పేరును ఖరారు చేస్తుందో వేచి చూడాలి.

News February 25, 2025

విశాఖ నుంచి షాలిమార్‌కు వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్

image

ప్రయాణికుల రద్దీ తగ్గించేందుకు విశాఖ- షాలిమార్‌కు(08508/07) వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. ఈ రైలు మార్చి 11 నుంచి ఏప్రిల్ 29వరకు ప్రతి మంగళవారం నడవనుంది. మంగళవారం విశాఖలో బయలుదేరి బుధవారం షాలిమార్ చేరుకుంటుంది. మళ్లీ బుధవారం షాలిమార్ నుంచి బయలుదేరి గురువారం విశాఖ చేరుతుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News February 25, 2025

విశాఖ జిల్లాలో 170 మంది బాలలకు విముక్తి

image

విశాఖ జిల్లా పరిధిలో బాలకార్మికుల విముక్తికి కార్మిక శాఖ ఆధ్వర్యంలో 10 ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించినట్లు ఉప కార్మికశాఖ కమిషనర్ సునీత.. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్‌కు వివరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కార్మిక శాఖపై సోమవారం సమీక్ష జరిపారు. ఈ ఆపరేషన్ ద్వారా 170 మంది బాల కార్మికులకు విముక్తి కలిగించినట్లు తెలిపారు. విశాఖలో బాల కార్మిక వ్యవస్థ నివారించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు.

error: Content is protected !!