News August 7, 2024
విశాఖలో ఆర్మీ ర్యాలీ.. ఏర్పాట్లపై సమీక్ష

విశాఖ పోర్ట్ ట్రస్ట్ డైమండ్ జూబ్లీ స్టేడియంలో ఈ నెల 23 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీపై ఆర్మీ, జిల్లా అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన మాటాడుతూ.. రాష్ట్రంలో 13 జిల్లాలకు చెందిన 8వేల మంది యువత ఈ ర్యాలీలో పాల్గొంటున్నట్లు తెలిపారు.
Similar News
News September 30, 2025
సీఎం పర్యటన.. 600 మంది బందోబస్తు: VZM SP

సీఎం చంద్రబాబు బుధవారం దత్తిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎస్పీ దామోదర్ హెలిప్యాడ్, సభాస్థలం, కాన్వాయ్ మార్గాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. సుమారు 600 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. గ్రామానికి వెళ్లే రహదారులు చిన్నవిగా ఉండటంతో వాహనాలు రహదారిపై నిలపకుండా చర్యలు చేపట్టాలన్నారు.
News September 30, 2025
ఎస్.కోట: చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదని ఆత్మహత్య

తన చదువుకి తగ్గ సరైన ఉద్యోగం దొరకలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఎస్.కోట మండలం కొత్తూరు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. సీఐ నరసింహమూర్తి వివరాల ప్రకారం.. కొత్తూరు గ్రామానికి చెందిన గోకాడ ప్రదీప్ హైదరాబాదులో ఓ నెట్వర్క్ కంపెనీలో డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. సొంత గ్రామం కొత్తూరుకు 28న వచ్చాడు. 29న ఇంట్లో ఉరి వేసుకున్నాడు. తండ్రి బాపు నాయుడు ఫిర్యాదుతో పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.
News September 30, 2025
విజయనగరం కలెక్టరేట్ వద్ద వైసీపీ నిరసన

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్థానిక కలెక్టరేట్ వద్ద వైసీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ నేతలు పాల్గొన్నారు.