News March 28, 2025

విశాఖలో ఈనెల 30న ట్రాఫిక్ ఆంక్షలు: సీపీ

image

విశాఖలో మార్చి 30న జరిగే IPL మ్యాచ్‌ల నిర్వహణపై సీపీ శంఖబ్రత బాగ్చీ గురువారం సమీక్షించారు. మ్యాచ్ జరిగే రోజు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ తెలిపారు. మ్యాచ్‌ రోజు శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు ఆనందపురం, పెందుర్తి, NAD మీదుగా నగరంలోకి రావాలన్నారు. చిన్న వాహనాలు మారికవలస, మిథులాపురి కాలనీ, బీచ్ రోడ్డు, జోడిగుడ్లపాలెం మీదుగా నగరంలోకి వెళ్లాలని సూచించారు.

Similar News

News March 31, 2025

విశాఖ సీపీ ఆఫీసులో పీ.జీ.ఆర్.ఎస్ రద్దు

image

రంజాన్ పండుగ సందర్భముగా ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో విశాఖ సీపీ ఆఫీసులో ప్రతి సోమవారం జరిగే “ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ ఆదివారం తెలిపారు. విశాఖ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ప్రజలకు అత్యవసర పరిస్థితిలో దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లలో, కంట్రోల్ రూమ్ నంబర్‌ను సంప్రదించాలన్నారు.

News March 30, 2025

విశాఖలో మ్యాచ్ చూసిన అనాథ చిన్నారులు 

image

వైజాగ్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌ను చూసేందుకు 65 మంది అనాథ‌ చిన్నారులకు విశాఖ సీపీ శంఖబ్రత భాగ్చీ అవ‌కాశం క‌ల్పించారు. వీరిలో భీమిలి ఎస్.ఓ.ఎస్ ఆర్గనైజేషన్ నుంచి 45 మంది, గాజువాకకు చెందిన డిజైర్ ఆర్గనైజేషన్ నుంచి 20 మందికి అవకాశం కల్పించారు. క్రికెట్ నేరుగా చూడడం తమకు చాలా సంతోషంగా ఉందని పిల్లలు హర్షం వ్యక్తం చేశారు. సీపీతో కలిసి వారు ఫొటోలు దిగారు.

News March 30, 2025

విశాఖలో క్రికెట్ మ్యాచ్ చూసిన ప్రముఖులు

image

విశాఖపట్నంలో ఆదివారం జరిగిన ఢిల్లీ- సన్ రైజర్స్ ఐపీఎల్ మ్యాచ్‌ను దేశ, రాష్ట్ర ప్రముఖులు వీక్షించారు. వీక్షించిన వారిలో ఐసీసీ ఛైర్మన్ జైషా, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!