News December 2, 2024

విశాఖలో ఈనెల 30న పోస్టల్ అదాలత్ నిర్వహణ

image

పోస్ట‌ల్ డాక్/పెన్షన్ అదాలత్‌ను ఈ నెల 30న ఉదయం 11.00 గంట‌ల‌కు ఎంవీపీ కాల‌నీలోని పోస్ట‌ల్ అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్ భ‌వ‌నంలో నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆర్.ఎం.ఎస్. -వి- డివిజ‌న్ సూప‌రింటెండెంట్ ప్ర‌స‌న్నరెడ్డి తెలిపారు. ఆర్.ఎం.ఎస్.(రైల్వే మెయిల్ స‌ర్వీసెస్) -వి- డివిజ‌న్ ప‌రిధిలోని ఉత్త‌రాంధ్ర‌, తూర్పు, పశ్చిమ గోదావ‌రి జిల్లాల‌కు చెందిన త‌పాలా సేవ‌లు, పింఛ‌న్లపై ఫిర్యాదులు 23 వరకు స్వీకరిస్తారు.

Similar News

News July 6, 2025

గిరి ప్రదక్షిణ ట్రాఫిక్ రూల్స్- 2

image

➦ అనకాపల్లి నుంచి సిటీ వైపు వచ్చే భారీ వాహనాలు లంకెలపాలెం జంక్షన్ నుంచి సబ్బవరం మీదుగా ప్రయాణం చేయాలి.
➦09 తేదీ ఉదయం 6 నుంచి అడవివరం, గోపాలపట్నం పెట్రోల్ బంక్ మధ్య వాహనాలకు నో ఎంట్రీ. దువ్వపాలెం, అక్కిరెడ్డిపాలెం, వేపగుంట జంక్షన్ మీదుగా ప్రయాణించాలి
➦అనకాపల్లి నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్ళు వాహనాలు విశాఖ సిటీలోకి అనుమతి లేదు. లంకెలపాలెం, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్ళాలి.

News July 6, 2025

గిరి ప్రదక్షిణకు ట్రాఫిక్ రూల్స్-3

image

➥ శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వైపు వచ్చే ప్రైవేటు ట్రావెల్ బస్సులు, RTC బస్సులు, ఇతర వాహనదారులు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి చేరుకోవాలి.
➥ గిరిప్రదక్షిణకు వచ్చు భక్తుల రద్దీ దృష్ట్యా విశాలాక్షి నగర్ బీచ్ రోడ్ జంక్షన్ నుంచి కురుపాం బీచ్ రోడ్ జంక్షన్ వరకు వాహనములు అనుమతించరు.
➥హనుమంతువాక జంక్షన్, వెంకోజీపాలెం జంక్షన్ వద్ద భక్తుల రద్దీ ఉంటుంది.

News July 6, 2025

గిరి ప్రదక్షిణ ట్రాఫిక్ రూల్స్- 4

image

➣జోడుగుల్లపాలెం జంక్షన్ నుంచి హనుమంతవాక జంక్షన్ వైపునకు, హనుమంతవాక జంక్షన్ నుంచి జోడుగుల్లపాలెం జంక్షన్ వైపునకు వాహనములు అనుమతించరు. ఆ ప్రాంతీయులు విశాలాక్షినగర్ మెయిన్ రోడ్డు గుండా ప్రయాణించి SBI జంక్షన్ వద్ద జాతీయ రహదారి చేరుకోవాలి.
➣సీతమ్మధార, అల్లూరి సీతారామరాజు స్టాట్యూ నుంచి వెంకోజిపాలెం జంక్షన్ వైపు వాహనాలు అనుమతించరు.
➣వెంకోజిపాలెం జంక్షన్ నుంచి అపుఘర్ జంక్షన్ వైపు వాహనాలకు నో ఎంట్రీ.