News July 11, 2025
విశాఖలో ఈసాయ్ సంస్థ విస్తరణ

విశాఖపట్నంలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఈసాయ్ ఫార్మాస్యూటికల్స్ నిర్ణయించింది. 2026 ఫిబ్రవరి నాటికి ఈ కేంద్రం పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇప్పటికే జేఎన్ ఫార్మా సిటీలో తయారీ ప్లాంట్‌ను నిర్వహిస్తున్న ఈసాయ్ సంస్థ ఈ కొత్త కేంద్రంతో భారత్‌లో తన ఉనికిని మరింతగా బలోపేతం చేయనుంది.
Similar News
News August 31, 2025
విశాఖలో సీఎం పర్యటన.. ఏర్పట్లు పరిశీలించిన జేసీ, సీపీ

సీఎం చంద్రబాబు సెప్టెంబర్ 2న విశాఖలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఆదివారం పరిశీలించారు. కోస్టల్ బ్యాటరీ వద్ద గల హెలిపాడ్‌ను చెక్ చేసి అక్కడ చేపట్టవలసిన పనులపై చర్చించారు. అనంతరం నోవాటెల్ వద్ద ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అజిత, ఆర్డీవో శ్రీలేఖ పాల్గొన్నారు.
News August 31, 2025
విశాఖలో ఉత్తరాంధ్ర ప్రజా సంకల్ప వేదిక సమావేశం

ఉత్తరాంధ్ర ప్రజా సంకల్ప వేదిక విస్తృత స్థాయి సమావేశం ఆదివారం విశాఖ జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు మాదిరి రంగాసాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సంకల్ప వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలపై, రాజ్యాంగ హక్కులను కాపాడడం కోసం పనిచేస్తుందన్నారు. అనంతరం వివిధ రంగాల్లో సేవచేస్తున్న 35 మంది ప్రతినిధులను సేవారత్న అవార్డులతో సత్కరించారు.
News August 31, 2025
విశాఖలో వైసీపీ సర్వసభ్య సమావేశం

మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు ఆధ్వర్యంలో వైసీపీ జిల్లా పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. మహిళా సాధికారతో YCP బలోపేతం అవుతుందని అన్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ కుంభారవి బాబు, ఇతర నేతలతో పాటు మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి పాల్గొన్నారు.