News January 15, 2026
విశాఖలో ఎగబాగుతున్న భూముల ధరలు(2/2)

చాలా ప్రాంతాల్లో గజం రూ.5 నుంచి 10 వేలు, కమర్షియల్ అయితే గజం రూ.30 వేలు వరకు పెరిగింది. ఈ పరిణామాలు స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయంలోనూ ప్రతిబింబిస్తున్నాయి. జిల్లాలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ గతేడాది APR నుంచి DEC వరకు సుమారు రూ.800 కోట్ల ఆదాయం సమకూర్చుకుంది. ఇందులో మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ రూ.200.58 కోట్లు, సూపర్ బజార్ రూ.172 కోట్లు, గాజువాక కార్యాలయం రూ.86.28 కోట్ల ఆదాయాన్ని సాధించాయి.
Similar News
News February 20, 2026
వరంగల్: తనిఖీలు లేకనే .. ఉపాధ్యాయుల గైర్హాజరు!

ప్రభుత్వ పాఠశాలలపై జిల్లా విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ, ఆకస్మిక తనిఖీలు లేనందునే ఉపాధ్యాయులు విధులకు హాజరై డుమ్మా కొడుతున్నట్లు తెలిసింది. జిల్లాలోని నెక్కొండ మండలంలో ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను డీఈవో రంగయ్య నాయుడు శుక్రవారం సస్పెండ్ చేసిన క్రమంలో విద్యాశాఖ అధికారులు ఇన్నాళ్లకు మేల్కొన్నారా..!? అంటున్నారు. కొందరు హెచ్ఎంల కారణంగానే టీచర్లు డుమ్మా కొడుతున్నట్లు చర్చ సాగుతోంది.
News February 20, 2026
విజయవాడలో మిస్సైన పిల్లలు గుజరాత్‌లో..!

విజయవాడ భవానీపురంలో <<19188253>>మిస్సైన ఇద్దరు పిల్లల కేసు<<>> సుఖాంతమైంది. ట్యూషన్‌కు వెళ్లకుండా ఇంట్లోని నగదు తీసుకుని పారిపోయిన మేరారామ్ (12), ఉమారామ్ (13) ఆచూకీ లభ్యమైంది. గురువారం విజయవాడ నుంచి ముంబైకి వెళ్లిన చిన్నారులు, అక్కడి నుంచి గుజరాత్‌కు వెళ్తుండగా పోలీసులు చాకచక్యంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పిల్లలు క్షేమంగా దొరకడంతో అటు తల్లిదండ్రులు, ఇటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
News February 20, 2026
ట్రంప్ టారిఫ్స్ దందా రివర్స్.. మన పరిస్థితి ఏంటి?

US అధ్యక్షుడు ట్రంప్ ఇన్నాళ్లూ ఆడిన టారిఫ్ గేమ్‌కు ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పుతో చెక్ పడినట్లు అయింది. అయితే టారిఫ్స్‌కు బెదిరి డీల్స్ కుదుర్చుకున్న దేశాల పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశమైంది. భారత్ కూడా ఇటీవల డీల్ కుదుర్చుకుంది. మరి సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం ఆ ట్రేడ్ డీల్‌పై పడుతుందా అనేది బిగ్ క్వశ్చన్. మారిన పరిణామాల నేపథ్యంలో భారత్ ఈ డీల్‌పై వెనక్కి తగ్గే అవకాశం ఉందా? అనేది తెలియాల్సి ఉంది.


