News August 7, 2025
విశాఖలో ఏపీఎల్.. ప్రవేశాలు ఉచితం

విశాఖ వేదికగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్-2025 రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 24 వరకు విశాఖ ACA-VDCA అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ లీగ్‌లో ఏడు జట్లు పోటీపడనున్నాయి. బ్రాండ్ అంబాసిడర్‌గా హీరో వెంకటేశ్ వ్యవహించనున్నారు. ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, శ్రీచరణ్ పాకాల లాంటి వారు పాల్గొననున్నారు. అన్ని మ్యాచులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ఏసీఏ ప్రతినిధులు ప్రకటించారు.
Similar News
News August 10, 2025
రాజమౌళి చిత్రమంటే లాకెట్ ఉండాల్సిందే!

రాజమౌళి-<<17349947>>మహేశ్<<>> కాంబోలో రాబోతున్న మూవీ నుంచి ఓ ఫొటో విడుదలైన విషయం తెలిసిందే. అది చూశాక SMలో ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది. జక్కన్న చిత్రమంటే హీరో మెడలో ఏదో ఒక లాకెట్ ఉండాల్సిందేనంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సింహ్రాదిలో కత్తి, ఛత్రపతిలో శంఖం, యమదొంగలో రౌండ్ లాకెట్, ఈగలో పెన్సిల్ హార్ట్, బాహుబలిలో శివలింగం, RRRలో ఓం(చరణ్), పులిగోరు(తారక్), ఇప్పుడు మహేశ్‌కు నందీశ్వరుడితో కూడిన త్రిశూలం.
News August 10, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News August 10, 2025
పులిచెర్ల: 11న పీజీఆర్ఎస్‌కు హాజరుకానున్న కలెక్టర్

పులిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో పాటు జిల్లా స్థాయి అధికారులు హాజరవుతున్నట్లు తహశీల్దార్ జయసింహ తెలిపారు. పులిచెర్ల, రొంపిచెర్ల మండల ప్రజలు తమ సమస్యలను ఈ కార్యక్రమంలో తెలియజేయవచ్చన్నారు. ప్రజలు సహకరించాలన్నారు.