News March 31, 2025
విశాఖలో ఐదేళ్ల బాలిక పట్ల పీటీ అసభ్యకర ప్రవర్తన

విశాఖలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన మాస్టారే చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన మధురవాడ పరిధిలో జరిగింది. వాంబే కాలనీలోని ఓ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో పీటీగా పనిచేస్తున్న రామచంద్రరావు ఐదేళ్ల చిన్నారి పట్ల అసభ్యకరంగా వ్యవహరించాడు. దీంతో ఆ చిన్నారి భయపడి తల్లిదండ్రులకు, టీచర్లకు చెప్పింది. వెంటనే వీరు పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పీటీని సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News September 13, 2025
జగ్గు జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం మహిళ మృతి

గాజువాక సమీపంలోని జగ్గు జంక్షన్ వద్ద నడిచి వెళుతున్న మహిళను ట్రాలర్ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నగంట్యాడ సమీపంలో నివాసముంటున్న విజయలక్ష్మి జగ్గు జంక్షన్ సమీపంలో నడిచి వెళుతుండగా స్టీల్‌ప్లాంట్ నుంచి వస్తున్న ట్రాలర్ ఢీకొంది. ఘటనాస్థలానికి గాజువాక ట్రాఫిక్ పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News September 13, 2025
విశాఖ: NMMS పరీక్షకు దరఖాస్తు చేశారా?

2025-26 విద్యాసంవత్సరానికి గాను నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ కుమార్ తెలిపారు. రూ.3.50 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న 8వ తరగతి విద్యార్థులు అర్హులు. సెప్టెంబర్ 30వ తేదీలోగా www.bse.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష డిసెంబర్ 7న జరుగుతుంది.
News September 13, 2025
భీమిలి: బాలికపై అత్యాచారం.. కోర్టు కీలక తీర్పు

భీమిలి ప్రాంతంలో 8 నెలల క్రితం వికలాంగురాలైన బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి పోక్సోచట్టం కింద 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. భీమిలి ప్రాంతంలో అమ్మమ్మ దగ్గర ఉన్న మైనర్‌ను బోరా ఎల్లారావు అత్యాచారం చేశాడు. బాదితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా కోర్టులో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పునిచ్చారు.