News November 15, 2025
విశాఖలో కూడా ఫిట్నెస్ టెస్ట్‌లకు అనుమతులు: మంత్రి

గంభీరంలో ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ I&Cవెహికల్ ఫిట్నెస్ సెంటర్‌ను రవాణాశాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి డీటీసీ ఆర్సిహెచ్ శ్రీనివాస్‌తో కలిసి శనివారం సందర్శించారు. నిర్మాణ పనులను పరిశీలించి టెస్టింగ్ మెషినరీ పనులను వేగవంతం చెయ్యాలని ఆదేశించారు. విశాఖలో కూడా రవాణా వాహనాల ఫిట్నెస్ టెస్ట్‌లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. దీంతో రోడ్డు భద్రతను మరింత పటిష్టం చేయవచ్చని పేర్కొన్నారు.
Similar News
News November 15, 2025
జగిత్యాల: మూడు రోజులు నీటిసరఫరా బంద్

జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి మండలం వెంకట్రావుపేటలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీతో మరమ్మతుల వల్ల 3 రోజులు నీటి సరఫరా నిలిపివేస్తామని కార్యనిర్వాహక ఇంజినీర్ M.జానకి తెలిపారు. ఈనెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గం (వెల్గటూర్, ధర్మారం, ఎండపల్లి మండలాలు మినహాయించి) పరిధిలోని గ్రామాలకు, మున్సిపాలిటీలకు మిషన్ భగీరథ నీరు అందించలేమని అన్నారు.
News November 15, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 5

24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (జ.నది)
25. రైతుకు ఏది ముఖ్యం? (జ.వాన)
26. బాటసారికి, రోగికి, గృహస్థునకు, చనిపోయిన వారికి బంధువులెవరు? (జ.సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)
27. ధర్మానికి ఆధారమేది? (జ.దయ)
28. కీర్తికి ఆశ్రయమేది? (జ.దానం)
29. దేవలోకానికి దారి ఏది? (జ.సత్యం)
<<-se>>#YakshaPrashnalu<<>>
News November 15, 2025
రామాయణంలోని ముఖ్య ఘట్టంతో ‘వారణాసి’: రాజమౌళి

మహేశ్ బాబుతో తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా గురించి SS రాజమౌళి కీలక విషయాలు వెల్లడించారు. ‘ఈ సినిమా మొదలు పెట్టేటప్పుడు రామాయణంలో ముఖ్యమైన ఘట్టం తీస్తున్నానని అస్సలు అనుకోలేదు. కానీ ఒక్కొక్క డైలాగ్, ఒక్కో సీన్ రాస్తుంటే నేను నేల మీద నడవడం లేదు, గాల్లో ఉన్నానని అనిపించింది’ అని అన్నారు. మహేశ్‌కు రాముడి వేషం వేసి, ఫొటో షూట్ చేస్తుంటే గూస్‌బంప్స్ వచ్చాయని తెలిపారు.


