News March 19, 2024
విశాఖలో కొత్త తరహా చోరీ

సాంకేతిక పరిజ్ఞానంతో శ్రీహరిపురం ఏటీఎం కేంద్రంలో కార్డు వినియోగించే చోట ఓ ముఠా కొద్దిపాటి మార్పులు చేసి నలుగురి నుంచి రూ. లక్ష కాజేసింది. నగదు డ్రా చేసేందుకు వచ్చినవారు కార్డు పెట్టగా అది లోపలికి పోతోంది. వెంటనే ముఠాలో ఒకడు వచ్చి సహాయం చేస్తున్నట్లు నటిస్తూ ముఠా అతికించిన నంబర్‌కి ఫోన్ చేయాలని సలహా ఇస్తాడు. నంబర్‌కి ఫోన్ చేయగా ముఠాలో మరొక సభ్యుడు వివరాలు సేకరించి వేరే ATMలో నగదు డ్రా చేస్తాడు.
Similar News
News February 17, 2026
గీతం యూనివర్సిటీకి సుప్రీంకోర్టు షాక్: వైసీపీ

4 వారాల్లో రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని గీతం వర్సిటీని సుప్రీంకోర్టు ఆదేశించిందని వైసీపీ ట్వీట్ చేసింది. వీబీసీ సంస్థ నుంచి భూములను కొనుగోలు చేసిన గీతం రూ.118 కోట్ల బకాయిలు చెల్లించాలని.. లేకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ ఎస్పీడీసీ నోటీసులు జారీ చేసిందని అందులో పేర్కొంది. తమను ఈ బకాయిలు చెల్లించమనడం చట్ట వ్యతిరేకమని గీతం బుకాయించినా.. వీబీసీ, గీతం వర్సిటీ ఒకటేనని ఎస్పీడీసీ వాదించిందంది.
News February 17, 2026
విశాఖలో పర్యాటక ప్రాంతాల పాక్షిక మూసివేత

అంతర్జాతీయ నౌకాదళ (IFR-2026) విన్యాసాల దృష్ట్యా విశాఖలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలపై VMRDA ఆంక్షలు విధించింది. కైలాసగిరి, సబ్‌మెరైన్, సీ-హారియర్ మ్యూజియంలు ఈ నెల 19వ తేదీ వరకు ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే 20వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 7 గంటల వరకు ఉండవన్నారు. అంతర్జాతీయ ప్రతినిధుల సందర్శనార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
News February 17, 2026
విశాఖ: లక్ష్యాన్ని మించిన కస్టమ్స్ వసూళ్లు

2024-25 ఆర్థిక సంవత్సరంలో కస్టమ్స్‌కు రూ.13,207.85 కోట్ల ఆదాయం లభించింది. అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం-2026 సందర్భంగా విశాఖపట్నం కస్టమ్స్ కమిషనరేట్ నిర్వహించిన ఆదాయ వసూళ్లపై అధికారులు వివరాలు వెల్లడించారు. ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో జనవరి 2026 నాటికి లక్ష్యంగా పెట్టుకున్న రూ.11,958.08 కోట్లను మించి ఇప్పటికే రూ.12,891.42 కోట్లు వసూలు చేసిందన్నారు.


