News October 4, 2025

విశాఖలో గంజిపడి 16 మంది పిల్లలకు గాయాలు

image

విశాఖలో అన్నదానం కార్యక్రమం వద్ద శనివారం అపశృతి చోటుచేసుకుంది. జాలరిపేటలోని దుర్గమ్మ ఆలయం సమీపంలో పిల్లా అప్పయ్యమ్మ సంఘం వద్ద అన్నదాన కార్యక్రమంలో గంజి పడి 16 మంది పిల్లలు, మహిళలు గాయపడ్డారు. బాధితులను కేజీహెచ్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కేజీహెచ్ సూపరింటెండెంట్ డా.వాణితో మాట్లాడి మెరుగైన చికిత్స ఇవ్వాలని సూచించారు.

Similar News

News October 4, 2025

విశాఖ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా

image

విశాఖలోని అన్నదాన కార్యక్రమంలో గంజిపడి <<17913036>>చిన్నారులు గాయపడిన<<>> ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ ప్రమాదంలో 20 మంది చిన్నారులను ఆస్పత్రికి తరలించగా, ఆరుగురు చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. స్వల్ప గాయాలైన ఇతరులను డిశ్చార్జ్ చేశామని, బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని కలెక్టర్ వెల్లడించారు.

News October 4, 2025

భీమిలి: ఐఎన్‌ఎస్ కళింగలో ఉద్యోగి సూసైడ్

image

భీమిలి సమీపంలోని ఐఎన్ఎస్ కలింగ వద్ద గన్‌తో కాల్చుకొని నేవీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరుకు చెందిన బాజీ షేక్(44) డీఎస్‌జీలో విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం సాయంత్రం గన్‌తో కాల్చుకొని మృతి చెందాడు. భీమిలి పోలీసులకు సమాచారం రావడంతో ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News October 4, 2025

విశాఖలో ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం ప్రారంభం

image

విశాఖ చిల్డ్రన్ ఏరినాలో ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి శనివారం ప్రారంభించారు. MLA వెలగపూడి రామకృష్ణ బాబు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 2.90 లక్షల డ్రైవర్లకు రూ.436 కోట్లు, విశాఖ జిల్లాలో 22,955 మందికి రూ.34.43 కోట్లు లబ్ధి అందనుందని మంత్రి డోలా పేర్కొన్నారు.