News February 28, 2025

విశాఖలో చిట్టీల పేరుతో మోసం

image

విశాఖలో చిట్టీల పేరుతో మోసం చేసిన దంపతులు అరెస్ట్ అయ్యారు. మల్కాపురానికి చెందిన దంపతులు మోహన్ రావు, లక్ష్మి చిట్టీల పేరుతో తనను మోసం చేశారని పెద్ద గంట్యాడకు చెందిన లక్ష్మీ న్యూపోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలోనే వీరి వ్యవహరంపై సీపీని బాధితులు ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో న్యూపోర్ట్ CI కామేశ్వరరావు వీరిద్దరిని గురువారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచారు. మార్చి 13 వరకు కోర్టు రిమాండ్ విధించింది.

Similar News

News February 28, 2025

విశాఖ-గుణుపూర్ పాసెంజర్‌కు అదనపు బోగి

image

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు విశాఖ – గుణుపూర్ (58505/06) పాసెంజర్‌కు అదనపు బోగి వేసినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ శుక్రవారం తెలిపారు. మార్చ్ 1 నుంచి మార్చ్ 31 వరకు అదనపు స్లీపర్ కోచ్ ఏర్పాటు చేశారు. తిరుగు ప్రయాణంలో కూడా అదనపు బోగి సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.

News February 28, 2025

విశాఖ: మెడికల్ స్టోర్ ముందే మృతి.. వివరాలు ఇవే

image

డాబా గార్డెన్ వద్ద గల నీలమ్మ వేప చెట్టు సమీపంలో మెడికల్ స్టోర్ వద్ద గురువారం ఓ వ్యక్తి మృతిచెందిన విషయం తెలిసిందే.అతడు మందులు కొనడానికి వచ్చి అక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న 108 సిబ్బంది అతడు మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి వద్ద మందుల చీటీ మాత్రమే ఉండడంతో టూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టి విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలానికి చెందిన రమణ (60)గా గుర్తించారు.

News February 28, 2025

గాజువాకలో చిన్నారిపై అత్యాచారయత్నం

image

గాజువాకలో ఓ చిన్నారిపై అత్యాచారయత్నం జరిగినట్లు గాజువాక పోలీసులకు ఫిర్యాదు అందింది. ఐదు సంవత్సరాల చిన్నారికి సన్నీబాబు అనే వ్యక్తి గురువారం మాయ మాటలు చెప్పి అత్యాచారానికి యత్నించడంతో ఆ చిన్నారి కేకలు వేసి తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి నిందితుడిని గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

error: Content is protected !!