News March 19, 2024
విశాఖలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతోంది: సబ్బవరం సీఐ

విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్నట్లు సబ్బవరం సీఐ పిన్నింటి రమణ తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. చెడ్డీ గ్యాంగ్ దౌర్జన్యంగా ఇళ్లల్లోకి ప్రవేశించి దాడులు చేసి బంగారు ఆభరణాలు, నగదు దోచుకుని పోతారన్నారు. అనుమానిత వ్యక్తుల కదలికలను గుర్తిస్తే వెంటనే 100 టోల్ ఫ్రీ నంబర్‌కి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News February 19, 2026
ఎంవీపీ: ప్లాస్టిక్ కవర్ల వాడకం.. రూ.1000 జరిమానా

జీవీఎంసీ అదనపు కమిషనర్ నల్లనయ్య గురువారం 18వ వార్డులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమించి ప్లాస్టిక్ కవర్లు ఉపయోగిస్తున్న రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ షాపుల యజమానులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఒక్కొక్కరికి రూ. 1000 జరిమానా విధించారు. ప్లాస్టిక్ రహిత నగరమే లక్ష్యమని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.
News February 19, 2026
మారికవలసలో యువకుడి ఆత్మహత్య

మధురవాడలోని పి.ఎమ్.పాలెం పోలీస్ స్టేషన్ పరిధి మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీలో విషాదం చోటుచేసుకుంది. కాలనీలో బ్లాక్ నంబర్ 88లో నివాసముంటున్న పీల శివ (19) బుధవారం తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
News February 18, 2026
మిలాన్ ఏర్పాట్లపై సీపీ సమీక్ష

విశాఖలో రేపు జరగనున్న మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి స్వయంగా పర్యవేక్షించారు. బీచ్ రోడ్డులోని హోల్డింగ్ పాయింట్లు, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో డ్రోన్లు, సీసీటీవీలు, సోషల్ మీడియా డెస్క్, భద్రతా వ్యవస్థల నిఘాను తనిఖీ చేసి, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.


