News August 28, 2025
విశాఖలో జనసేన సభకు అల్లూరి పేరు

సేనాతో – సేనాని కార్యక్రమం సభకు అల్లూరి సీతారామ రాజు సభ ప్రాంగణంగా పేరు ఖరారు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేపటి నుంచి మూడు రోజులపాటు ఈ సభను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన పార్టీ దిశ, ప్రజా సమస్యలపై చర్చలు జరగనున్నాయని అన్నారు. తేన్నేటి విశ్వనాధం, గురజాడ అప్పారావు, శ్రీ శ్రీ, కోడి రామ్మూర్తి, గుండమ్మ పేర్లు ముఖ ద్వారాలకు పెడతామన్నారు.
Similar News
News August 28, 2025
శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

శ్రీకాకుళం, పలాస మీదుగా సంత్రాగచ్చి(SRC)- యశ్వంత్‌పూర్(YPR) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.02863 SRC- YPR రైలును Sept 4 నుంచి Sept 18 వరకు ప్రతి గురువారం, నం.02864 YPR- SRC మధ్య నడిచే రైలును Sept 6 నుంచి Sept 20 వరకు ప్రతి శనివారం నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఏపీలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.
News August 28, 2025
నేడు విద్యాసంస్థలకు సెలవు : ADB కలెక్టర్

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు ఈనెల 28న సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. విద్యార్ధుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
News August 28, 2025
KNR: 94 మంది సహకార సంఘాల కార్యదర్శుల బదిలీలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సహకార సంఘాల కార్యదర్శులను భారీగా బదిలీ చేశారు. మొత్తం 125 సంఘాల్లో 94 మంది కార్యదర్శులను మారుస్తూ సహకార శాఖ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒకేచోట ఎక్కువ కాలం పనిచేయడం వల్ల నిధుల దుర్వినియోగం, అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. KNR-25, JGTL-37, PDPL-18, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 14మంది బదిలీ అయ్యారు.