News March 6, 2025

విశాఖలో జాబ్ మేళాలు

image

SEEDAP ద్వారా ఏపీ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మార్చి 14, 18, 28వ తేదీల్లో మైనారిటీ యువతకు జాబ్ మేళాలు నిర్వహించనున్నారు. 14న భీమిలి గవర్నమెంట్ పాలిటెక్నిక్, వీఎస్ కృష్ణ కాలేజ్, మార్చి 18న గాజువాక గవర్నమెంట్ ఐటీఐ, కంచరపాలెం పాలిటెక్నిక్, మార్చి 28న గాజువాక నాక్ సెంటర్, గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీ, కంచరపాలెం ఓల్డ్ ఐటీఐలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. వివరాలకు esedap.ap.gov.in చూడాలి.

Similar News

News March 29, 2026

BREAKING: విశాఖ కలెక్టర్ బదిలీ..

image

విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర‌ ప్రసాద్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం ఉదయం ఉత్తర్వులు విడుదల చేసింది. హరేంధిర‌ ప్రసాద్‌ను కాకినాడకు ట్రాన్స్‌ఫర్ చేశారు. అయితే విశాఖ జిల్లా కలెక్టర్‌గా ఎమ్.అభిషిక్త్ కిషోర్‌ను నియమిస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. విశాఖ కలెక్టర్‌గా హరేంధిర ప్రసాద్ అనేక సంస్కరణలు చేపట్టారు.

News March 29, 2026

విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో రేపు పీజీఆర్ఎస్

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 29, 2026

విశాఖలో చికెన్ ధరలు ఇలా ఉన్నాయి

image

విశాఖలో చికెన్ ధరలు ఆదివారం (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. చికెన్ లైవ్ రూ.140, విత్ స్కిన్‌‌ రూ.250, స్కిన్‌లెస్ 260, సొంఠ్యాం కోడి కేజీ రూ.320 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా మటన్ కేజీ రూ.1000, కోడిగుడ్లు డజన్ రూ.55గా పలుకుతున్నాయి. వీటితోపాటు చేపలు, రొయ్యిల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.