News March 5, 2025

విశాఖలో టుడే టాప్ న్యూస్

image

➤ విశాఖలో ఎన్నికల కోడ్ ఎత్తివేత: కలెక్టర్
➤ దివ్యాంగుల పారా స్టేడియం కోసం స్థల పరిశీలన
➤ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు స్టేడియం సిద్ధం
➤ మార్చి 17 నుంచి 134 కేంద్రాలలో పదో తరగతి పరీక్షలు
➤ నేడు విద్యుత్ ప్రధాన కార్యాలయంలో లైన్‌మ్యాన్ దివస్
 ➤ రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ హోదా కొనసాగేలా చర్యలు

Similar News

News March 5, 2025

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

image

మార్చి 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ విషయమై కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. గురజాడ కళాక్షేత్రం వేదికగా జరుగనున్న ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తమ శాఖల తరఫున చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు.

News March 4, 2025

అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచుల నిర్వ‌హ‌ణ‌కు స్టేడియం సిద్ధం

image

ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఈనెల‌లో జ‌ర‌గ‌బోయే రెండు ఐపీఎల్ మ్యాచులు విశాఖకు గ‌ర్వ‌కార‌ణంగా నిలిచేలా నిర్వ‌హిస్తామ‌ని ఆంధ్ర‌ క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు, ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు. మంగ‌ళ‌వారం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో చేప‌ట్టిన ఆధునీకర‌ణ ప‌నులను క‌లెక్ట‌ర్ హరేంధిర ప్రసాద్‌తో కలిసి ప‌రిశీలించారు. మార్చి 24న ఢిల్లీ -లక్నో, మార్చి 30న ఢిల్లీ -సన్‌రైజర్స్‌ హైదరాబాద్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

News March 4, 2025

విశాఖలో ఎన్నిక‌ల ప్రవర్తనా నియమావళి ఎత్తివేత‌: కలెక్టర్

image

విశాఖలో ఎన్నిక‌ల ప్రవర్తనా నియమావళి ఎత్తివేసినట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు.రాష్ట్రంలో వివిధ చోట్ల గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువడటం, ఇతర ప్రక్రియలు ముగియటంతో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళి ఎత్తివేసినట్లు మంగళవారం సాయంత్రం తెలిపారు. ఈ మేరకు ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాలు జారీ చేసిన‌ట్లు వెల్లడించారు.

error: Content is protected !!