News October 10, 2025

విశాఖలో టుడే టాప్ న్యూస్

image

➤ కంచరపాలెం దొంగతనం కేసును చేధించిన పోలీసులు
➤ విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు
➤ అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు 20 దరఖాస్తులు
➤ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ వైసీపీ నేతలు
➤ VMRDA గార్డెన్ కార్మికులను విధులలోకి తీసుకోవాలి: CITU
➤ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కావడం లేదు: MLA వంశీ కృష్ణ
➤ సింహాచలంలో అమ్మవారి బేడా తిరువీధి మహోత్సవం
➤ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరంనకు 15 వినతులు

Similar News

News October 11, 2025

విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు

image

పూండి రైల్వే స్టేషన్‌లో ఇంటర్ లాకింగ్ సిస్టం పనుల కారణంగా విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం పవన్ శుక్రవారం తెలిపారు. విశాఖ – బరంపూర్ ఎక్స్‌ప్రెస్ (18526), విశాఖ – భువనేశ్వర్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ (22820), విశాఖ – బరంపూర్ ప్యాసింజర్ (58532ను) అక్టోబర్ 13న రద్దు చేసినట్లు పేర్కొన్నారు. తిరుగు ప్రయాణంలో ఇవే రైళ్లు అక్టోబర్ 14న రద్దు చేసినట్లు వెల్లడించారు.

News October 10, 2025

విశాఖ: ‘ధాన్యం సేకరణపై అప్రమత్తంగా ఉండాలి’

image

ఖరీఫ్ సీజన్ 2025–26లో ధాన్యం సేకరణపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం తెలిపారు. విశాఖ జిల్లాలో 40 రైతు సేవా కేంద్రాల ద్వారా 10,000 మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా నిర్ణయించారు. కామన్ రకం క్వింటాకు రూ.2,369, ఏ-గ్రేడ్ రకానికి రూ.2,389 మద్దతు ధరగా నిర్ణయించారు. రైతులకు ఇబ్బందులు ఎదురైతే టోల్‌ఫ్రీ నంబర్ 1967కి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.

News October 10, 2025

విశాఖపట్నంలో సింధూర జ్వాల.. ఎంతో ప్రత్యేకం

image

ఆపరేషన్ సింధూర్.. భారతీయుల అందరి హృదయాల్లో నిరంతరం ప్రతిధ్వనించే మాట ఇది. అయితే ఈ సింధూరం పేరు కలిగిన మొక్క విశాఖలోని జీవవైవిధ్య ఉద్యానవనంలో కనువిందు చేస్తోంది. తెల్లని పుష్పాలు, కాయలతో ప్రకృతి ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ ఉద్యానవనంలో చాలా కాలంగా ఈ మొక్కను సంరక్షిస్తున్నారు. ప్రస్తుతం పుష్పాలు, కాయలతో ఎంతో సుందరంగా ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది.